శ్రీరామ‌న‌వ‌మి రోజున సితార స‌ర్‌ప్రైజ్‌.. ఆనందంలో మ‌హేష్ బాబు

Sitara Ghattamaneni Kuchipudi Dance video goes viral.సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార గురించి ప్ర‌త్యేకంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 April 2022 6:25 AM GMT
శ్రీరామ‌న‌వ‌మి రోజున సితార స‌ర్‌ప్రైజ్‌.. ఆనందంలో మ‌హేష్ బాబు

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యామిలీ విష‌యాల‌తో పాటు చిన్న పిల్ల‌ల‌ ఇంట్రెస్టింగ్ వీడియోస్‌ షేర్ చేస్తూ.. చాలా మంది ఫాలోవ‌ర్ల‌ను సొంతం చేసుకుంది. తండ్రిని మించి తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకుంటోంది. సితార వెస్టర్స్ డ్యాన్స్ తో ఇన్నాళ్లు ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా.. శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా తొలిసారి సితార కూచిపూడి డ్యాన్స్ చేసింది.

ఇందుకు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పంచుకుంది. ఆ వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి.. 'ఇది నా మొదటి కూచిపూడి నాట్య పఠనం. నా గురువులు అరుణాభిక్షు మరియు మహతీభిక్షుల వద్ద కూచిపూడి నేర్చుకున్నాను. డీవీఎస్ శాస్త్రి సంగీతం అందించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని, శ్రీరాముడి పుట్టినరోజున ప్రపంచవ్యాప్తంగా ప్రేమ, శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.' అంటూ నోట్ రాసింది.

ఈ వీడియోను మ‌హేష్ బాబు షేర్ చేస్తూ.. 'సితార మొద‌టి కూచిపూడి డ్యాన్స్ ఇది. ప‌విత్ర శ్రీ‌రామ‌న‌వమి రోజున ఈ నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌ను మీకు చూపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాముడి గొప్ప‌ద‌దాన్ని ఈ శ్లోకం తెలియజేస్తుంది' అని సితార వీడియోను షేర్ చేయ‌డంతో పాటు త‌న కుమారైకు కూచిపూడి నృత్యాన్ని నేర్పిన వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటీజ‌న్లు లైకులు, షేర్లు, కామెంట్ల‌తో హోరెత్తిస్తున్నారు.

Next Story
Share it