తల్లి కాబోతున్న సింగ‌ర్‌ శ్రేయా ఘోషల్

Singer Shreya Ghoshal Announces First Pregnancy With This Adorable Post.ప్ర‌ముఖ గాయని శ్రేయా ఘోషల్ తల్లి కాబోతోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 March 2021 7:30 AM GMT
Singer Shreya Ghoshal Announces First Pregnancy With This Adorable Post.

ప్ర‌ముఖ గాయని శ్రేయా ఘోషల్ తల్లి కాబోతోంది. ఈ విష‌యాన్ని ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. 2015, ఫిబ్రవరి 5న ఆమె తన స్నేహితుడు శైలాదిత్య ముఖోపాధ్యాయను పెళ్లి చేసుకుంది. 'బేబి శ్రేయాదిత్య రాబోతుంది. షీలాదిత్య‌, నేనూ ఈ శుభ‌వార్తను మీతో పంచుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది. జీవితంలో కొత్త ప్ర‌యాణానికి సిద్ద‌మ‌వుతోన్న ఈ త‌రుణంలో మీ దీవెన‌లు మాకెంతో అవ‌స‌రం' అని శేయా ఘోష‌ల్ ట్వీట్ చేసింది.

'స‌రిగ‌మ' విజేత‌గా కెరీర్‌ను ఆరంభించింది శ్రేయా ఘోష‌ల్‌. హిందీ, తెలుగుతో పాటు అనేక భార‌తీయ భాష‌ల్లో ఆమె పాటలు పాడింది. సంజయ్ లీలా భన్సాలీ 2000లో ఆమెకు హిందీ దేవదాసు సినిమాలో 5 పాటలను పాడే అవ‌కాశం ఇచ్చారు. మొద‌టి సినిమాలోని పాట‌ల‌కే ఆమెకు భారత జాతీయ చలనచిత్ర పురస్కారం ద‌క్కింది. ఉత్తమ నేపథ్య గాయనిగా ఉత్తరాది ఫిల్మ్ ఫేర్ పురస్కారం లభించింది. ఆ త‌ర్వాత ఆమె వెనుదిరిగి చూడ‌లేదు. 'గ‌జిని', '3 ఇడియ‌ట్స్‌', 'ద‌బాంగ్‌', 'క్రిష్‌', 'ప‌ద్మావ‌త్' వంటి చిత్రాల్లో పాడారు. ఇటీవల విడుద‌లైన‌ 'ఉప్పెన' సినిమాలోని 'జల జల జలపాతం' అనే పాటను పాడింది. 'ట‌క్ జ‌గ‌దీశ్' తో మ‌రోసారి అభిమాల‌ను మెప్పించారు. బిడ్డకు జ‌న్మినిస్తున్న శ్రేయా ఘోషల్‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.


Next Story
Share it