గజల్ గాయకుడు భూపిందర్ సింగ్ కన్నుమూత
Singer Bhupinder Singh passes away in Mumbai.ప్రముఖ గజల్ గాయకుడు భూపీందర్ సింగ్ ఇక లేరు. ఇన్నాళ్లు తన గాత్రంతో
By తోట వంశీ కుమార్ Published on 19 July 2022 4:23 AM GMTప్రముఖ గజల్ గాయకుడు భూపీందర్ సింగ్ ఇక లేరు. ఇన్నాళ్లు తన గాత్రంతో ఎంతో మందిని అలరించిన ఆయన సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. కోలన్ క్యాన్సర్, కొవిడ్ అనంతర సమస్యలతో ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. మోహమ్మద్ రఫీ, ఆర్డీ బర్మాన్, మదన్ మోహన్, లతా మంగేష్కర్, గుల్జర్‌లకు సమకాలీకుడు అయిన భూపీందర్ సింగ్ 'దో దివానే షెహర్ మే', 'ఏక్ అకేలా ఇస్ షెమర్ మే', 'తోడీ సీ జమీన్ తోడా ఆస్మాన్', 'దునియా చుటే యార్ నా చుటే', 'కరోగి యాద్ 'తో లాంటి ఎన్నో సుమధుర గీతాలను ఆయన ఆలపించారు. 'దమ్ మారో దమ్', 'చురా లియా హై', 'చింగారి కోయి బడ్కే', 'మెహబూబా ఓ మెహబూలా 'లాంటి పాటలకు గిటారిస్ట్‌గా చేశారు. ఆయన భార్య ప్రముఖ గాయకురాలు మిథాలీ సింగ్.
ఢిల్లీ ఆల్ ఇండియా రేడియోలో సింగర్‌గా కెరీర్‌ను భూపీందర్‌సింగ్ ప్రారంభించారు. 1964లో చేతన్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన హఖీఖాత్ ఆయన తొలి చిత్రం. 1980లో సినిమాలకు క్రమంగా దూరం అవుతూ వచ్చారు. భార్య మిథాలీతో కలిసి ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఉన్నారు. కేవలం సింగర్‌గానే కాకుండా.. గిటారిస్ట్‌గా హరే రామా హరే కృష్ణ చిత్రంలో 'దమ్ మారో దమ్', యాదోన్ కీ బారాత్ చిత్రంలో 'చురా లియా హై', 'చింగారి కోయ్ భడ్కే', షోలే చిత్రంలోని 'మెహబూబా ఓ మెహబూబా' లాంటి సూపర్ హిట్ సాంగ్స్‌కు పని చేశారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఈ మేరకు ఓ సంతాప ప్రకటన విడుదల చేశారు.