'బిగ్ బాస్ తమిళ్‌' హోస్ట్‌గా.. హీరో శింబు

Simbu replaces Kamal Haasan as the host of Bigg Boss Ultimate. ప్రముఖ తమిళ టెలివిజన్ రియాలిటీ షో 'బిగ్ బాస్ (తమిళం) అల్టిమేట్' యొక్క ప్రస్తుత సీజన్‌కు హోస్ట్‌గా నటుడు

By అంజి  Published on  24 Feb 2022 1:37 PM GMT
బిగ్ బాస్ తమిళ్‌ హోస్ట్‌గా.. హీరో శింబు

ప్రముఖ తమిళ టెలివిజన్ రియాలిటీ షో 'బిగ్ బాస్ (తమిళం) అల్టిమేట్' యొక్క ప్రస్తుత సీజన్‌కు హోస్ట్‌గా నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ స్థానంలో హీరో శింబు వచ్చారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ బిగ్‌బాస్‌ షో యొక్క కొత్త హెస్ట్‌ శింబును పరిచయం చేస్తూ ఒక చిన్న ప్రోమోను విడుదల చేసింది. గత ఆదివారం నటుడు కమల్ హాసన్ పని కట్టుబాట్లు, షెడ్యూల్‌ కుదరకపోవడంతో ఈ సీజన్ బిగ్‌బాస్‌ షో నుండి నిష్క్రమించారు. "లాక్‌డౌన్‌లు, విధించిన పరిమితుల కారణంగా బలవంతంగా 'విక్రమ్' సినిమా నిర్మాణ కార్యకలాపాలను రీషెడ్యూల్ చేయడం వల్ల అనివార్యంగా 'బిగ్ బాస్ అల్టిమేట్' కోసం కేటాయించాల్సిన తేదీలు కుదరలేదని'' అని కమల్ చెప్పారు.

'మానాడు'లో బ్లాక్‌బస్టర్‌ని అందించిన శింబు.. బిగ్ బాస్ (తమిళం) అల్టిమేట్ షోతో టీవీలో అరంగేట్రం చేయనున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తాజా బిగ్‌బాస్‌ తమిళ్‌ ప్రోమో శింబు అభిమానులను ఆనందపరిచింది. శింబు మాట్లాడుతూ.. "ఇంతకుముందు ఉలగనాయగన్ కమల్ హాసన్ హోస్ట్ చేసిన అత్యంత ఇష్టపడే, వీక్షించిన టీవీ షోలలో ఒకదాన్ని హోస్ట్ చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ప్రతి వారాంతంలో షో ద్వారా వీక్షకులను కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది." అన్నారు.


Next Story
Share it