థియేటర్లలో కలిసి రాని 'మిస్ యు'.. మరి ఓటీటీలో.?

ఆశికా రంగనాథ్-సిద్ధార్థ్ జంటగా నటించిన సినిమా 'మిస్ యు'. ఈ చిత్రం గత నెలలో విడుదలైంది.

By Medi Samrat  Published on  9 Jan 2025 9:15 PM IST
థియేటర్లలో కలిసి రాని మిస్ యు.. మరి ఓటీటీలో.?

ఆశికా రంగనాథ్-సిద్ధార్థ్ జంటగా నటించిన సినిమా 'మిస్ యు'. ఈ చిత్రం గత నెలలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు OTTలో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

మిస్ యూ జనవరి 10వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం రెండింటిలోనూ అందుబాటులో రానుంది. ఈ సినిమా OTT లో ఆకట్టుకుంటుందని ఆశిస్తూ ఉన్నారు. సిద్ధార్థ్ గత సంవత్సరం నటించిన ఇండియన్ 2, మిస్ యు చిత్రాలతో వరుసగా డిజాస్టర్లను చవిచూశాడు. అంతకు ముందు 2023 చితా సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు సిద్ధార్థ్ శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన 'సిద్ధార్థ్ 40'(వర్కింగ్ టైటిల్) కోసం పని చేస్తున్నాడు. ఈ సినిమా సిద్ధార్థ్ కు కంబ్యాక్ మూవీ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

Next Story