'శ్యామ్ సింగరాయ్' ట్రైలర్ విడుదల.. డిఫరెంట్ గెటప్స్‏లో నాని అదుర్స్‌

Shyam Singha Roy Telugu Trailer. వరంగల్‏ నగరంలో 'శ్యామ్ సింగరాయ్' సినిమా సందడి నెలకొంది. ఈ సినిమా ప్రిరీలిజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. కాగా ఈ ఈవెంట్‌లో సినిమా ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు.

By అంజి  Published on  14 Dec 2021 2:33 PM GMT
శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ విడుదల.. డిఫరెంట్ గెటప్స్‏లో నాని అదుర్స్‌

వరంగల్‏ నగరంలో 'శ్యామ్ సింగరాయ్' సినిమా సందడి నెలకొంది. ఈ సినిమా ప్రిరీలిజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. కాగా ఈ ఈవెంట్‌లో సినిమా ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న తాజా సినిమా శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. సినిమాలో నాని రెండు డిఫరెంట్ గెటప్స్‏లో కనిపించబోతున్నాడు. 'శ్యామ్ సింగరాయ్' నుండి విడుదలైన టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై చాలా అంచనాలను క్రియేట్‌ చేశాయి. ఈ సినిమాను నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.

కలకత్తా బ్యాక్‏డ్రాప్‏లో పిరియాడిక్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న శ్యామ్‌సింగరాయ్‌.. ఈనెల 24న థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. సినిమా ప్రమోషన్స్ చిత్రయూనిట్‌ వేగవంతం చేసింది. ఇక సినిమా ట్రైలర్‌ చూస్తుంటే.. నాని ఫ్యాన్స్‌ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైలర్‌ వచ్చిన ప్రతి డైలాగ్‌ చప్పట్లు కొట్టించేలా కనిపిస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్‌ అందించారు.


Next Story
Share it