తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, ప్రముఖ హీరో కమల్ హాసన్ ఓటమి పాలయ్యారు. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్(బీజేపీ)పై 1,300 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయారు. ఒకానొక దశలో కమల్ లీడింగ్ లో ఉన్నప్పటికీ.. ఆ తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. కమల్ ఓడిపోవడం ఆయన అభిమానులకు షాకింగ్‌కు గురి చేసింది. ఆయనతో పాటు ఆయన పార్టీకి చెందిన వారు 142 స్థానాల్లో పోటీ చేయగా వారందరూ పరాజయం పొందారు. సరికొత్త రాజకీయ వాతావరణాన్ని సృష్టించడమే తన లక్ష్యమని ముందే ప్రకటించిన కమల్, అన్న మాటను చేసి చూపారు. విలువలకు కట్టుబడిన వ్యక్తిగా గెలిచిన కమల్.. ఓట్లను పొందడంలో మాత్రం ఓడిపోయారు. కమల్ సహా ఎంఎన్ఎం పార్టీ అభ్యర్థులంతా ఓడిపోయారు.
కమల్ ఓటమిపాలవడంపై ఆయన కూతురు, హీరోయిన్ శృతిహాసన్ స్పందించారు.'మిమ్మల్ని చూస్తుంటే ఎప్పటికీ గర్వంగానే ఉంటుంది అప్పా' అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన తండ్రి ఫొటోను షేర్ చేసింది. తన తండ్రిని పైటర్ అంటూ అభివర్ణిస్తూ ద ఫైటర్ అనే హ్యాష్ ట్యాగ్‌ను పోస్ట్ చేశారు. శృతి హాసన్ కూడా తన తండ్రి గెలుపు కోసం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే..! కమల్ హాసన్ కూటమికి కనీసం సీట్లు వస్తాయని.. కమల్ హాసన్ అయినా గెలుస్తారని అనుకున్నారు. కానీ ఓటర్లు ఆయనకు విజయాన్ని ఇవ్వలేకపోయారు.