నాకూ ఆర్థిక సమస్యలు ఉన్నాయి : శృతి హాసన్

Shruti Haasan says she also has financial constraints. తాజాగా ఇంస్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడిన శృతి హాసన్ తనకు కూడా ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చింది.

By Medi Samrat  Published on  12 May 2021 4:13 AM GMT
Shruti Haasan

శృతి హాసన్.. లోక నాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. హీరోయిన్ గానూ, సింగర్ గానూ రాణిస్తూ ఉంది. మ్యూజిక్ మీద శృతి హాసన్ కు ఉండే పిచ్చి అంతా ఇంతా కాదు. తన బ్యాండ్ కోసం డబ్బులు కావాలనే ఉద్దేశ్యంతోనే శృతి హాసన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పలువురు స్టార్ హీరోలతో సినిమాల్లో నటిస్తూ ఉంది శృతి హాసన్. కంబ్యాక్ క్వీన్ అని చెబుతూ ఉన్నారు. ఎంతో మంది ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు లక్కీ ఛార్మ్ శృతి హాసన్ అనే టాక్ నడుస్తూ ఉంది. శృతి హాసన్ నటించిన క్రాక్, వకీల్ సాబ్ భారీ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే..! ఇప్పుడు ప్రభాస్ తో సాలార్ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడిన శృతి హాసన్ తనకు కూడా ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. అన్ని సినిమాలు చేస్తూ, పెద్ద స్టార్ హీరో కుమార్తెకు ఆర్థిక సమస్యలు ఏంటా అని అనుకోవచ్చు అందరూ..!

కరోనా ఎప్పుడు అయిపోతుందా అని చూస్తూ ఇంట్లో కూర్చోలేనని.. లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే నేను షూటింగ్‌లో పాల్గొనాలని తెలిపింది. కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో మాస్క్‌ లేకుండా షూటింగ్‌ చేయడం చాలా కష్టమే అయినప్పటికీ ఆర్థిక సమస్యల వల్ల పని చేయక తప్పదని తెలిపింది. షూటింగ్స్‌ ప్రారంభించిన వెంటనే సెట్స్‌లోకి వెళ్లిపోతానని చెప్పింది. గత 11ఏళ్లుగా నా ఖర్చులకి నేను సంపాదించుకుంటున్నానని.. నేను ఒక ఇండిపెండెంట్‌ మహిళను అని తెలిపింది. నా బిల్లులు చెల్లించుకోవడానికి అమ్మానాన్నలను డబ్బులు అడగలేనని.. నా కాళ్ల మీద నిల‌బ‌డ‌టానికే నేను ప్ర‌య‌త్నిస్తానని తెలిపింది. కరోనా వల్ల చాలామంది ఖరీదైన కార్లు, ఇళ్లు కొనుక్కోలేదని చెబుతుంటారు. కానీ నేను మాత్రం ఓ ఇల్లు కొనుకున్నా. ఇండిపెండెంట్‌గా ఎదగడం నాకెంతో గర్వంగా ఉందని చెప్పింది. ఇంతకూ తనకున్న ఆర్థిక సమస్యలేమిటో క్లారిటీగా చెప్పలేదు శృతి.


Next Story
Share it