'పుష్ప-2'లో శ్రద్ధా కపూర్ ఎంట్రీ.. ప్రధాన పాత్ర పోషిస్తుందా.?

అల్లు అర్జున్ కెరీర్‌లో ది బెస్ట్ మూవీస్‌లో ఒకటైన 'పుష్ప: ది రైజ్' సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By Kalasani Durgapraveen  Published on  22 Oct 2024 7:04 AM GMT
పుష్ప-2లో శ్రద్ధా కపూర్ ఎంట్రీ.. ప్రధాన పాత్ర పోషిస్తుందా.?

అల్లు అర్జున్ కెరీర్‌లో ది బెస్ట్ మూవీస్‌లో ఒకటైన 'పుష్ప: ది రైజ్' సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుద‌ల‌పై చాలా కాలంగా చర్చ జ‌రుగుతుంది. ముందుగా పుష్ప 2 చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయాలని భావించారు. త‌రువాత‌ డిసెంబర్‌లో థియేటర్లలోకి రానుందని ప్ర‌క‌టించారు. 'పుష్ప 2'కి సంబంధించిన ప్రతి అప్‌డేట్ జనాల్లో సినిమాకు సంబంధించిన ఉత్కంఠను పెంచింది.

గతంలో వచ్చిన 'పుష్పరాజ్' ఈ వ్యాపారం ద్వారా ఎదుగుతూ కనిపించగా.. 'పుష్ప 2'లో రాజులా స్మ‌గ్లింగ్ సామ్రాజ్యాన్ని పరిపాలించనున్నాడు.

ఇక 'పుష్ప 2'లోని స్టార్ కాస్ట్ గురించి చెప్పాలంటే కొన్ని కొత్త ముఖాలు కనిపించే అవ‌కాశం ఉంది. గ‌త పార్ట్‌లో 'ఊ అంటావా' పాటలో అల్లు అర్జున్‌తో సమంత రూత్ ప్రభు అద్భుతమైన డ్యాన్స్ చేసింది. ఈసారి ఆ స్థానంలో శ్రద్ధా కపూర్‌ని చూడవచ్చని వార్తలు వచ్చాయి.

రిపోర్ట్స్ ప్రకారం.. పుష్ప 2 లో ఐటెమ్ సాంగ్‌ కోసం చాలా మంది నటీమణులను సంప్రదించారు. చివరికి శ్రద్ధా కపూర్ వద్ద మేకర్స్ అన్వేషణ ఆగిపోయింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో కలిసి ఓ ప్రత్యేక ఐటెం డ్యాన్స్‌లో ఆమె కనిపించనుంది. ఇదే జరిగితే సౌత్, నార్త్‌లకు చెందిన ఈ ఇద్దరు పెద్ద స్టార్స్‌ని కలిసి చూడడం ఫ్యాన్స్‌కి మాంచి ట్రీట్ అవుతుంది.

అల్లు అర్జున్‌కు జంటగా రష్మిక మందన్న నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్‌లో 'పుష్ప 2' విడుదల కానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విక్కీ కౌశల్ ఛావా ను ఢీ కొట్ట‌నుంది. ఈ రెండు సినిమాలు డిసెంబర్ 6న విడుదల కానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎవరిపై విజయం సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.


Next Story