'స్త్రీ 2' సక్సెస్.. ప్రధాని మోదీని దాటేసిన శ్రద్ధా కపూర్
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ తాజా చిత్రం 'స్త్రీ 2' విజయాన్ని సంతోషంగా ఎంజాయ్ చేస్తుంది
By Medi Samrat Published on 21 Aug 2024 4:13 PM ISTబాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ తాజా చిత్రం 'స్త్రీ 2' విజయాన్ని సంతోషంగా ఎంజాయ్ చేస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టిస్తోంది. ఈ సినిమా భారీ విజయంకు సంబంధించిన ప్రభావం శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై కూడా కనిపిస్తోంది. 'స్త్రీ 2' విజయంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు వేగంగా పెరుగుతున్నారు. దీంతో ఆమె ప్రధాని నరేంద్ర మోదీని కూడా దాటేసింది. ఈ క్రమంలోనే అత్యధిక మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న భారతీయురాల లిస్టులో శ్రద్ధా కపూర్ మూడో స్థానంలో నిలిచింది.
శ్రద్ధా కంటే ఇద్దరు మాత్రమే ముందున్నారు. మొదటి స్థానంలో విరాట్ కోహ్లీ.. రెండో ప్లేస్‌లో ప్రియాంక చోప్రా ఉన్నారు. అయితే ఎక్స్ (గతంలో ట్విటర్) ఫాలోవర్ల విషయంలో ప్రధాని మోదీ చాలా ముందున్నారు.
నటి శ్రద్ధా కపూర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 91.4 మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఇన్‌స్టాగ్రామ్‌లో 91.3 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ 271 మిలియన్ల ఫాలోవర్లతో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. నటి ప్రియాంక చోప్రాకు 91.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
శ్రద్ధా కపూర్ తర్వాత అలియా భట్ నాలుగో స్థానంలో ఉంది. ఆ తర్వాత కత్రినా కైఫ్, దీపికా పదుకొనే, నేహా కక్కర్ ఉన్నారు. ‘స్త్రీ 2’ సినిమా శ్రద్ధా కపూర్ పాపులారిటీని అమాంతం పెంచేసింది. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రద్ధతో పాటు రాజ్‌కుమార్‌రావు, అపర్‌శక్తి ఖురానా కూడా కీలక పాత్రలు పోషించారు. విడుదలైన నాలుగో రోజులలోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి మహిళా ప్రధాన చిత్రం 'స్త్రీ 2'.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు 70 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత సినిమా కలెక్షన్లు పుంజుకున్నాయి. ఈ సినిమా ఆగస్టు 15న అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఆరో రోజైన మంగళవారం ఈ సినిమా రూ.25.8 కోట్ల బిజినెస్ చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు రూ.258.09 కోట్లు రాబట్టింది.