చిక్కుల్లో బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి భ‌ర్త‌.. అరెస్ట్‌

Shilpa Shetty husband Raj Kundra arrest.ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 July 2021 2:40 AM GMT
చిక్కుల్లో బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి భ‌ర్త‌.. అరెస్ట్‌

ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్‌కుంద్రా.. అశ్లీల‌ వీడియోలను చిత్రీకరించి కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలతో ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పోలీసుల దగ్గర కీలక ఆధారాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే ఈ వ్యవహారంలో రాజ్ కుంద్రాపై కేసు నమోదైంది. తాజాగా ఈ నీలి చిత్రాల రాకెట్‌లో రాజ్ కుంద్రా పాత్ర ప్రముఖంగా ఉన్నట్టు కీలక ఆధారాలు లభించడంతో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మోడల్ షెర్లిన్ చోప్రా స్టేట్‌మెంట్ ఆధారంగా.. వెబ్ సిరీస్ పేరుతో అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలపై కుంద్రాకు సంబంధించిన ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఉద్యోగికి ఏప్రిల్‌లో బెయిల్ మంజూరైంది. ఈ కేసులో.. రాజ్ కుంద్రాకు పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ సమన్లపై స్పందించిన శిల్పాశెట్టి భర్త ఆ స్టార్టప్ నుంచి తాను అప్పటికే వైదొగిలిగానని.. ఆ కంపెనీకి తనకూ ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు.ఆ వెబ్ సిరీస్ నిర్మాణంలో గానీ, ఆ సన్నివేశాల చిత్రీకరణలో గానీ తన పాత్ర లేదని పోలీసులకు తెలిపాడు. అనంత‌రం ముంద‌స్తు బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేశాడు.

శిల్పాశెట్టిని రాజ్‌కుంద్రా 2009లో వివాహం చేసుకున్నాడు. వీరికి 2012లో వియాన్ జ‌న్మించాడు. గతేడాది స‌రోగ‌సి ద్వారా స‌మిష అనే పాప‌కు జ‌న్మనిచ్చారు. జేఎల్ స్ట్రీమ్ యాప్ యజ‌మాని అయిన రాజ్‌కుంద్రా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్)లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌(ఆర్ఆర్‌)కు స‌హ య‌జ‌మానిగా ఉన్నారు. 2013లో ప్ర‌కంప‌న‌లు సృష్టించిన ఐపీఎల్ బెట్టింగ్‌, స్పాట్ ఫిక్సింగ్ కేసులో డిల్లీ పోలీసులు రాజ్‌కుంద్రాను ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే.

Next Story