ప్రముఖ మ్యూజిక్ వీడియో కాంటా లగాలో తన నటనకు పేరుగాంచిన నటి షెఫాలి జరివాలా 42 సంవత్సరాల వయసులో మరణించారు. శుక్రవారం రాత్రి ఆమెకు గుండెపోటు వచ్చినట్లు సమాచారం. ఆమె భర్త, నటుడు పరాగ్ త్యాగి ఆమెను ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె మరణాన్ని నిర్ధారించిన తర్వాత, ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం కూపర్ ఆసుపత్రికి పంపారు. షెఫాలి 2015లో పరాగ్ త్యాగిని వివాహం చేసుకుంది.
ఆమె పరాగ్ త్యాగితో పాటు నాచ్ బలియే 5, నాచ్ బలియే 7 డ్యాన్స్ రియాలిటీ షోలలో కూడా పాల్గొంది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రాల చిత్రం 'ముజ్సే షాదీ కరోగి'లో కూడా షెఫాలీ ప్రత్యేక పాత్రలో కనిపించింది. 2002లో 'కాంటా లగా' పాటలో కనిపించిన తర్వాత ఆమె స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. ఇది పాప్ కల్చర్‌కు సంచలనంగా మారింది. షెఫాలి బిగ్ బాస్ 13లో పాటిస్పేట్ చేసింది. నటి ఆకస్మిక మరణం వినోద పరిశ్రమను, ఆమె అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.