షీజన్‌కు ఇతర అమ్మాయిలతో కూడా సంబంధాలు.. ఇంకో రెండు రోజుల కస్టడీ పొడిగింపు

Sheezan Khan's custody extended by 2 days. టీవీ నటి తునీషా శర్మ మృతి కేసులో దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.

By M.S.R  Published on  28 Dec 2022 2:35 PM GMT
షీజన్‌కు ఇతర అమ్మాయిలతో కూడా సంబంధాలు.. ఇంకో రెండు రోజుల కస్టడీ పొడిగింపు

టీవీ నటి తునీషా శర్మ మృతి కేసులో దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. తునీషాను ఆత్మహత్యకు పురికొల్పాడన్న ఆరోపణలపై పోలీసులు ఇప్పటికే ఆమె సహ నటుడు షీజాన్‌ ఖాన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. షీజాన్ పోలీస్‌ కస్టడీ గడువు ముగిసిపోవడంతో పోలీసులు నేడు అతడిని ముంబైలోని వసాయ్‌ కోర్టులో హాజరుపర్చారు. నిందితుడిని ఇంకా విచారించాల్సిన అవసరం ఉందని అధికారులు కోరడంతో కోర్టు అతని పోలీస్‌ కస్టడీని మరో రెండు రోజులు పొడిగించింది. తునీషా శర్మ షూటింగ్‌ స్పాట్‌లోనే ఉరేసుకుని మరణించింది. 25న తెల్లవారుజామున ఆమె సహనటుడు, ప్రియుడు షీజాన్‌ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి వసాయ్‌ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు నాలుగు రోజుల పోలీస్‌ కస్టడీ విధించింది. ఆ నాలుగు రోజులు నిందితుడిని పలు కోణాల్లో ప్రశ్నించారు. నిందితుడి సోదరిని కూడా వాలివ్‌ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించారు.

రెండు రోజుల కస్టడీ పొడిగించడంతో డిసెంబర్ 30న షీజాన్ ని కోర్టులో హాజరుపరచనున్నారు. నటి ఆత్మహత్య కేసులో ఇప్పటివరకు 14 మంది వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, షీజన్ తన రహస్య ప్రియురాలితో తొలగించిన చాట్‌లను వారు స్వాధీనం చేసుకున్నారు. తునీషా మరణించిన రోజు చాట్‌లు ఉన్నాయి. షీజన్‌కు ఇతర అమ్మాయిలతో కూడా సంబంధాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారని, అందువల్ల వారు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉందని.. అందువల్ల కస్టడీని మరో 2 రోజులు పొడిగించారని తునీషా మామ ప్వానా శర్మ తెలిపారు.


Next Story