హమ్మయ్య.. ఎట్టకేలకు ఆ సినిమా ఓటీటీ రిలీజ్ వచ్చేసింది!!

చాలా సినిమాలు థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలలో సందడి చేస్తూ ఉంటాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Aug 2024 7:00 PM IST
Sharwanand, Maname movie, OTT, Tollywood

హమ్మయ్య ఎట్టకేలకు ఆ సినిమా ఓటీటీ రిలీజ్ వచ్చేసింది!! 

చాలా సినిమాలు థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలలో సందడి చేస్తూ ఉంటాయి. అందుకే థియేటర్లలో పెద్ద సినిమాలకు, హిట్ టాక్ వచ్చిన సినిమాలకు మాత్రమే అంతంత మాత్రం కలెక్షన్స్ ఉన్నాయి. ఇక ఓ తెలుగు సినిమా ఓటీటీ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ సినిమా మరేదో కాదు.. 'మనమే'. శర్వానంద్ సినిమా థియేటర్లలో విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు తప్పకుండా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోందంటూ గతంలో కొన్ని రిలీజ్ డేట్ లను అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు మరో ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.

విడుదలైన కొన్ని నెలల తర్వాత 'మనమే' OTT విడుదల గురించి అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా డిజిటల్ విడుదల హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. రొమాంటిక్ డ్రామా ఆగస్టు 16 నుండి ప్రసారం కానుంది. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన మనమే ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఇందులో వెన్నెల కిషోర్, సీరత్ కపూర్, అయేషా ఖాన్ తదితరులు నటించారు. ఈ ప్రాజెక్ట్‌కి హేషామ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు సమకూర్చారు.

Next Story