శర్వానంద్‌ 'ఒకే ఒక జీవితం' విడుదలకు డేట్‌ ఫిక్స్‌

Sharwanand Oke Oka Jeevitham movie release date announced. టాలీవుడ్‌ హీరో శర్వానంద్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ 'ఒకే ఒక జీవితం'. సై-ఫై జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై

By అంజి  Published on  10 Aug 2022 10:11 AM IST
శర్వానంద్‌ ఒకే ఒక జీవితం విడుదలకు డేట్‌ ఫిక్స్‌

టాలీవుడ్‌ హీరో శర్వానంద్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ 'ఒకే ఒక జీవితం'. సై-ఫై జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై శర్వానంద్‌ బోలేడన్నీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకు శ్రీకార్తిక్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా చిత్రీకరణ పూర్తై నెలలు గడుస్తున్నా.. మూవీ రిలీజ్‌పై నిర్మాతలు ఎలాంటి అప్‌డేట్స్‌ ఇవ్వలేదు. లేటెస్ట్‌గా చిత్రయూనిట్‌ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది. సెప్టెంబర్‌ 9న 'ఒకే ఒక జీవితం' మూవీని రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ విడుదల కానున్నట్లు తెలిపారు. గతంలో విడుదలైన పోస్టర్లు, టీజర్‌ మూవీపై మంచి అంచనాలను క్రియేట్‌ చేశాయి.

ఈ మూవీలో అక్కినేని అమల కీ రోల్‌లో నటిస్తోంది. శర్వానంద్‌ సరసన రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్‌ ఆర్‌ ప్రకాష్‌, ఎస్‌ఆర్‌ ప్రభు కలిసి డ్రీమ్‌ వారియర్ పిక్చర్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన అమ్మ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. జేక్స్‌ బేజోయ్‌ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇక ఇటీవల శర్వానంద్‌ నటించిన భారీ అంచనాల మధ్య రిలీజైన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా హిట్‌ కోసం శర్వానంద్‌ ఎదురుచూస్తున్నాడు.


Next Story