చెత్త సినిమా అంటూ రివ్యూలు.. 100 కోట్ల కలెక్షన్స్ ..!

షాహిద్ కపూర్, కృతి సనన్ జంటగా నటించిన సినిమా 'తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా'. ఫిబ్రవరి 9న విడుదలైంది ఈ సినిమా.

By Medi Samrat  Published on  19 Feb 2024 9:17 PM IST
చెత్త సినిమా అంటూ రివ్యూలు.. 100 కోట్ల కలెక్షన్స్ ..!

షాహిద్ కపూర్, కృతి సనన్ జంటగా నటించిన సినిమా 'తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా'. ఫిబ్రవరి 9న విడుదలైంది ఈ సినిమా. చాలా రివ్యూలు సినిమాకు నెగటివ్ గానే వచ్చాయి. అయితే ఈ సినిమా మొదటి వారానికే థియేటర్ల నుండి తీసేస్తారని అనుకున్నారు. అయితే ఆశ్చర్యకరంగా 2వ వారాంతంలో కూడా సినిమా బాగానే ఆడింది. 2వ ఆదివారం నాడు ఈ చిత్రం భారతదేశంలో 6కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. ప్రేమికుల రోజున కాస్త మొదలైన కలెక్షన్స్ ఊపు రెండో ఆదివారం వరకూ కొనసాగింది. దాదాపు 1వ రోజు ఓపెనింగ్ డే నంబర్లకు దగ్గరగా ఉంది. విమర్శకుల రివ్యూలకు భిన్నంగా ప్రేక్షకుల నోటి మాటలు ఉన్నాయి. పెద్దగా బాలీవుడ్ సినిమాల విడుదలలు లేకపోవడం కూడా సినిమా కలెక్షన్లను పెంచింది.

ఈ చిత్రం 10 రోజుల్లో భారతదేశంలో 62 కోట్ల నెట్‌ని వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా టోటల్ గ్రాస్ 108 కోట్లు దాటింది. ఈ సినిమా 150 కోట్ల మార్క్‌కు చేరువయ్యే అవకాశం ఉంది. షాహిద్ కపూర్, కృతి సనన్‌లకు వరుస ఫ్లాప్ ల తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ కొద్దిగా ఊరట కలిగించే విషయమే!! 2019లో బ్లాక్‌బస్టర్ కబీర్ సింగ్ తర్వాత, షాహిద్ కపూర్ కు పెద్దగా హిట్స్ లేవు. తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా సినిమాకు కూడా పెద్దగా హైప్ లేకుండానే థియేటర్లలో విడుదలైంది.

Next Story