మూడు రోజుల్లో రూ.300 కోట్లు.. భారీ క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతున్న 'పఠాన్'

Shah Rukh Khan Pathaan Movie Collections. షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రానికి మంచి కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి.

By M.S.R  Published on  28 Jan 2023 8:15 PM IST
మూడు రోజుల్లో రూ.300 కోట్లు.. భారీ క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతున్న పఠాన్
షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రానికి మంచి కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాని మొత్తం గ్రాస్ కలెక్షన్‌ రూ. 313 కోట్లకు చేరుకుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ కు అద్భుతమైన బాక్సాఫీస్ కలెక్షన్స్ వస్తున్నాయి.


పఠాన్ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు రాబట్టింది. ఈ మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.313 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. భారత్ లో మూడో రోజు పఠాన్ రూ.38 కోట్లు రాబట్టగా.. ఇప్పటి వరకూ మొత్తం రూ.161కోట్లు వసూలైనట్టు చెప్పారు. తమిళ, తెలుగు భాషల్లో కలిపి మరో రూ.5.75 కోట్లు వచ్చాయన్నారు. భారత్ లో రూ.201కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.313 కోట్లు రాబట్టిందని ట్వీట్ లో చెప్పుకొచ్చారు.

ఇక షారుఖ్ ఖాన్ #AskSRK సెషన్‌లో సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడారు. చిత్రం బాక్సాఫీస్ విజయంపై స్పందించారు. కలెక్షన్లను ఎలా చూస్తున్నారని అభిమానులు అడగ్గా, సినిమా కలెక్షన్స్ కంటే ప్రేక్షకుల ప్రేమను లెక్కిస్తున్నానని చెప్పారు షారుఖ్ ఖాన్.


Next Story