పఠాన్ ట్రైలర్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..?

Shah Rukh Khan impresses with high-octane action and fight scenes. షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా పఠాన్. 2018లో వ‌చ్చిన ‘జీరో’ త‌ర్వాత షారుఖ్ నుండి

By M.S.R  Published on  4 Jan 2023 1:30 PM IST
పఠాన్ ట్రైలర్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..?

షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా పఠాన్. 2018లో వ‌చ్చిన 'జీరో' త‌ర్వాత షారుఖ్ నుండి మ‌రో సినిమా రాలేదు. షారుఖ్‌ నాలుగేళ్ళ గ్యాప్‌ను పూర్తి చేసేందుకు వరుసగా సినిమాల‌ను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన 'ప‌ఠాన్' రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శక‌త్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ డేట్‌ పై ప్రకటన వచ్చింది. పఠాన్‌ ట్రైలర్‌ను జనవరి 10న రిలీజ్‌ చేయబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇక ఇటీవలే మేకర్స్‌ రిలీజ్‌ చేసిన టీజర్‌, పాటలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇక 'భేషరమ్‌ రంగ్‌' పాట వివాదం కూడా ఈ సినిమాపై మరింత బజ్‌ క్రియేట్‌ అయింది. షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే నటించింది. జాన్‌ అబ్రహం కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా జనవరి 26న హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్‌ కానుంది. పఠాన్ సినిమా RAW ఏజెంట్ల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించబోతున్నాడనే ప్రచారం కూడా సాగుతోంది.



Next Story