'శాకుంతలం' రిలీజ్ డేట్ ఫిక్స్

Shaakuntalam Movie to release on November 4.స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'శాకుంత‌లం'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Sept 2022 11:11 AM IST
శాకుంతలం రిలీజ్ డేట్ ఫిక్స్

స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'శాకుంత‌లం'. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మైథలాజికల్ డ్రామాగా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. షూటింగ్ ఎప్పుడో పూరైనా కానీ విడుద‌ల విష‌య‌మై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు చిత్ర‌బృందం. అయితే.. అభిమానుల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ విడుద‌ల తేదీని చిత్ర బృందం ప్ర‌క‌టించేసింది.

ఈ చిత్రాన్ని నవంబర్ 4న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఓ చిన్న వీడియో గ్లింప్స్‌ను కూడా విడుద‌ల చేసింది. ఈ వీడియోలో సమంత, దేవ్ మోహన్.. శకుంతల, దుశ్యంతలుగా పోజిచ్చిన తీరు అద్భుతంగా ఉంది.

మ‌ల‌యాళ యువ న‌టుడు దేవ్ మోహన్.. దుశ్యంతుడిగా న‌టిస్తుండ‌గా, మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్, గౌతమి కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కుమార్తె అల్లుఅర్హ కీల‌క‌పాత్ర‌లో నటించింది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story