'శాకుంతలం' రన్ టైమ్.. సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారో తెలుసా..?

సమంత హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం శాకుంతలం. పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 April 2023 9:30 PM IST
Shaakuntalam, Samantha, Gunashekar, Tollywood

'శాకుంతలం' రన్ టైమ్.. సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారో తెలుసా..?  

సమంత హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం శాకుంతలం. పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణశేఖర్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్‌ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. శాకుంతలం రన్‌టైం 142 నిమిషాలు ( 2 గంటల 22 నిమిషాలు) అని తెలుస్తోంది. ఈ శుక్రవారం థియేటర్లలో సినిమా సందడి చేయనుంది.

భారీ బడ్జెట్‌తో రూపొందించబడిన 'శాకుంతలం' కాళిదాసు సంస్కృత నాటకం 'అభిజ్ఞాన శాకుంతలం' ఆధారంగా రూపొందించారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో విడుదలవ్వనుంది. 3డీలో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై గుణ టీమ్‌ వర్క్స్‌తో కలిసి నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న రాత్రి హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో 'శాకుంతలం' 3D వెర్షన్ ప్రీమియర్‌ ప్రదర్శించారు. ప్రీమియర్ షోలకు మంచి స్పందన వచ్చిందని చిత్ర యూనిట్ చెబుతోంది.

Next Story