స‌మంత‌ ‘శాకుంతలం’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్‌

Shaakuntalam Movie New Release Date. సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ కొత్త రిలీజ్ డేట్ వచ్చింది.

By Medi Samrat  Published on  10 Feb 2023 5:53 PM IST
స‌మంత‌ ‘శాకుంతలం’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్‌

సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ కొత్త రిలీజ్ డేట్ వచ్చింది. ఏప్రిల్ 14న మూవీని రిలీజ్ చేయనున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని ముందుగా ఫిబ్రవరి 17న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన సినిమా వాయిదా పడింది. ఇందులో సమంత శకుంత‌ల‌గా కనిపించనుండగా.. దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ న‌టించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌మర్పణ‌లో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నీలిమ గుణ నిర్మించారు. గ‌త ఏడాది య‌శోద చిత్రంతో హిట్ కొట్టిన స‌మంత ఈ ఏడాదిలో శాకుంత‌లం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

త్రీడీ టెక్నాల‌జీతో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ చేయనున్నారు. శాకుంత‌లం చిత్రంలో క‌లెక్ష‌న్ కింగ్‌ డా. మంచు మోహ‌న్ బాబు, ప్ర‌కాష్‌ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువ‌రాజు భ‌ర‌తుడి పాత్ర‌లో న‌టించింది.

Next Story