కిలిమంజారోను అధిరోహించిన ఏడేళ్ల హైదరాబాదీ బుడతడు..

Seven year old hyderabad boy scales mount kilimanjaro. ఏడేళ్ల ప‌సి ప్రాయంలోనే ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన శిఖ‌రాల్లో ఒక‌టైన కిలిమంజారోను అధిరోహించి అద‌ర‌హో అనిపించుకున్నాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 March 2021 4:21 PM IST
Seven year old hyderabad boy scales mount kilimanjaro

ప‌ర్వ‌తాధిరోహ‌ణ అనేది ఎంతో క‌ష్టంతో కూడుకున్న‌ది. ఎంత‌టి అనుభ‌వం ఉన్న‌వారైనా స‌రే ప‌ర్వాధిరోహ‌ణ‌లో క‌ష్టాల‌ను ఎదుర్కోన‌క త‌ప్పదు. అలాంటిది ఏడేళ్ల ప‌సి ప్రాయంలోనే ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన శిఖ‌రాల్లో ఒక‌టైన కిలిమంజారోను అధిరోహించి అద‌ర‌హో అనిపించుకున్నాడు హైద‌రాబాద్‌కు చెందిన చిన్నారి విరాట్ చంద్ర‌. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను లెక్కచేయకుండా మార్చి ఆరో తేదీన కిలిమంజారో పర్వతాన్ని ఎక్కాడు. ఫ‌లితంగా ఈ పర్వతాన్ని అధిరోహించిన పిన్న వయస్కుడిగా నిలిచాడు.

దీనిపై అత‌డి కోచ్ భ‌ర‌త్ మాట్లాడుతూ.. విరాట్‌లో ప‌ర్వ‌తాధిరోహ‌ణ‌పై ఎంతో త‌ప‌న ఉండేద‌న్నాడు. అత‌డితో పాటు మిగతా పిల్ల‌ల‌కు శిక్ష‌ణ ఇచ్చినా.. వారు మ‌ధ్య‌లోనే త‌ప్పుకొన్నార‌ని.. అయితే విరాట్ మాత్రం ప‌ట్టుద‌ల‌తో అనుకున్న‌ది సాధించాడ‌న్నారు. విరాట్ మాట్లాడుతూ.. త‌న క‌జిన్ల ద్వారా ప‌ర్వ‌తాధిరోహ‌ణ‌పై ఇష్టం పెరిగింద‌ని.. దీంతో వారిలాగానే తాను కూడా పర్వతాధిరోహణ చేయాలనుకున్నానని చెప్పాడు. దీని గురించి తన తల్లిదండ్రులకు చెప్పానని, భరత్ సార్ దగ్గర శిక్షణను ఇప్పించారని వెల్లడించాడు. ముందు చాలా భయమేసినా.. తన లక్ష్యాన్ని చేరాలన్న సంకల్పంతో శిఖరాన్ని అధిరోహించానని విరాట్ చెబుతున్నాడు



Next Story