విషాదం.. ప్రముఖ నిర్మాత రాజేంద్రప్రసాద్ క‌న్నుమూత‌

Senior Producer Gorantla Rajendra Prasad passed away.టాలీవుడ్ సినీ పరిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 July 2022 12:22 PM IST
విషాదం.. ప్రముఖ నిర్మాత రాజేంద్రప్రసాద్ క‌న్నుమూత‌

టాలీవుడ్ సినీ పరిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ చ‌ల‌న చిత్ర నిర్మాత గోరంట్ల రాజేంద్ర‌ప్ర‌సాద్ క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో ఆయ‌న బాధ‌ప‌డుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో గురువారం ఉద‌యం తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 86 సంవ‌త్స‌రాలు. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేశారు.

మాధవి పిక్చర్స్‌ బ్యానర్లో దొరబాబు, సుపుత్రుడు, కురుక్షేత్రం, ఆటగాడు వంటి తదితర చిత్రాలను నిర్మించారు. ప్రముఖ దివంగ నిర్మాత రామానాయడుతో కలిసి పలు చిత్రాలకు సహా నిర్మాతగా గోరంట్ల రాజేంద్ర ప్రసాద్‌ వ్యవహరించారు.

Next Story