సీనియర్ నటి జయసుధకు కరోనా.. అమెరికాలోనే చికిత్స
Senior Actress Jayasudha Tested Corona positive.దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఇక సినీ ఇండస్ట్రీని
By తోట వంశీ కుమార్ Published on 8 Feb 2022 2:40 AM GMT
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఇక సినీ ఇండస్ట్రీని ఈ మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే చిరంజీవి, మహేష్‌బాబు, కీర్తి సురేష్ వంటి సినీ ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకోగా.. తాజాగా సహజనటి జయసుధ కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.
గత కొద్ది రోజులుగా జయసుధ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాకు వెళ్లి అక్కడ చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటున్నారు అని సంతోషించే లోపే జయసుధ కరోనా బారిన పడ్డారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
14 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమలో తన కెరీర్‌ను మొదలు పెట్టారు జయసుధ. తనదైన శైలిలో నటిస్తూ సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. దాదాపు 48 ఏండ్ల సినీ కెరీర్‌లో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి హీరోల సరసన నటించారు. అనంతరం ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలకు అక్కగా, తల్లిగా నటించారు. ఇక 2019లో వచ్చిన మహర్షి, రూలర్ చిత్రాల తర్వాత ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.