ముగిసిన కైకాల స‌త్య‌నారాయ‌ణ అంత్య‌క్రియ‌లు

Senior Actor Kaikala Satyanarayana Last Rites.సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ అంత్య‌క్రియ‌లు ముగిసాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Dec 2022 12:34 PM IST
ముగిసిన కైకాల స‌త్య‌నారాయ‌ణ అంత్య‌క్రియ‌లు

నవరస నట సార్వభౌమ బిరుదాంకితుడు, సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ అంత్య‌క్రియ‌లు ముగిసాయి. జూబ్లీహిల్స్‌లోని మ‌హాప్ర‌స్థానంలో ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో కైకాల అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. కైకాల పెద్ద కుమారుడు ల‌క్ష్మీనారాయ‌ణ తండ్రికి త‌ల‌కొరివి పెట్టారు. అంత‌క ముందు ఫిలింన‌గ‌ర్‌లోని కైకాల నివాసం నుంచి మ‌హాప్ర‌స్థానం వ‌ర‌కు అంతిమ‌యాత్ర కొన‌సాగింది. ఆఖ‌రి సారి కైకాలను చూసేందుకు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు త‌ర‌లివ‌చ్చారు.

గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కైకాల స‌త్య‌నారాయ‌ణ శుక్రవారం తెల్లవారు జామున ఫిలింనగర్‌లోని ఆయ‌న‌ నివాసంలో కన్నుమూశారు. ఆయ‌న మ‌ర‌ణించార‌ని తెలిసి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. నటులు పవన్‌ కళ్యాణ్‌, చిరంజీవి, వెంకటేష్‌, నాగబాబు, రాజేంద్ర ప్రసాద్‌, రాధ వంటి సినీ ప్ర‌ముఖుల‌తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ వంటి రాజ‌కీయ నేత‌లు పార్థివ‌దేహానికి నివాళులు అర్పించారు.

Next Story