ఓటీటీలోకి రాబోతున్న ఫీల్ గుడ్ సినిమా.. మిస్ అవ్వకండి..!

ఫీల్ గుడ్ సినిమాలు అత్యంత అరుదుగా థియేటర్లలోకి వస్తూ ఉంటాయి.

By Medi Samrat  Published on  19 Oct 2024 1:50 PM IST
ఓటీటీలోకి రాబోతున్న ఫీల్ గుడ్ సినిమా.. మిస్ అవ్వకండి..!

ఫీల్ గుడ్ సినిమాలు అత్యంత అరుదుగా థియేటర్లలోకి వస్తూ ఉంటాయి. అయితే ఆ సినిమాలన్నీ థియేటర్లలో హిట్ అవుతూ ఉంటాయా అంటే చెప్పలేము. అయితే ఓటీటీలోకి వచ్చినప్పుడు మాత్రం అబ్బా.. ఈ సినిమాను ఎలా థియేటర్లలో మిస్ అయ్యామా అని ఫీల్ అయిపోతూ ఉంటాం. అలాంటి కోవలోకే వస్తుంది 'సత్యం సుందరం' సినిమా.

కార్తీ, అరవింద్ స్వామి నటించిన సత్యం సుందరం సినిమా OTT లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాకు ప్రశంసలు దక్కినా, బాక్సాఫీస్ వద్ద మాత్రం యావరేజ్‌గా నిలిచింది. ఈ చిత్రం అక్టోబర్ 25న అన్ని భాషల్లో ప్రముఖ OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ సినిమాను చూడడం కోసం చాలా మంది ప్రేక్షకులు ఈ చిత్రం OTT రాక కోసం ఎదురు చూస్తున్నారు. సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంపై ప్రశంసలు దక్కాయి. కార్తీ, అరవింద్ స్వామి నటనకు ప్రశంసలు లభించాయి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 కోట్ల గ్రాస్‌ను కూడా వసూలు చేసింది. ఓటీటీ విడుదల తర్వాత ఈ సినిమా మరింత మందికి చేరువవ్వనుంది.

Next Story