స‌త్య‌దేవ్ 'గాడ్సే' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

Satyadev's Godse Movie OTT Release Date fix.వైవిధ్య‌మైన సినిమాల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 July 2022 9:16 AM IST
స‌త్య‌దేవ్ గాడ్సే ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

వైవిధ్య‌మైన సినిమాల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు స‌త్య‌దేవ్‌. కెరీర్ ప్రారంభంలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించిన.. ఇప్పుడు హీరోగా అద‌ర‌గొడుతున్నాడు. ఇటీవ‌ల 'గాడ్సే ' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. గోపి గ‌ణేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం జూన్ 17న విడుద‌ల అయ్యింది. మ‌ల‌యాళ కుట్టి ఐశ్య‌ర్య క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో నాగ‌బాబు ఓ కీల‌క పాత్ర‌ను పోషించారు. ఇక ఈ చిత్రం ఓటీటీ విడుద‌ల తేదీ ఫిక్స్ అయ్యింది. ప్ర‌ముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చిత్ర బృందం తెలియ‌జేసింది. సి.క‌ళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక స‌త్య‌దేవ్ న‌టిస్తున్న సినిమా విష‌యానికి వ‌స్తే.. 'గుర్తుందా శీతాకాలం ' విడుద‌లకు సిద్దంగా ఉంది. బాలీవుడ్‌లో అక్ష‌య్ కుమార్ 'రామ్‌సేతు'లో, టాలీవుడ్‌లో చిరంజీవి 'గాడ్‌ఫాద‌ర్‌'లోనూ స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు.

Next Story