వకీల్‌సాబ్.. 'సత్యమేవ జయతే' లిరికల్ పాట విడుదల
Sathyameva Jayathe Lyrical song release. వకీల్‌సాబ్ చిత్రంలోని 'సత్యమేవ జయతే' అనే లిరికల్ పాట వీడియో విడుదల చేయనున్నట్లు చెప్పింది
By తోట వంశీ కుమార్ Published on
3 March 2021 11:33 AM GMT

సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'వకీల్‌సాబ్'. 'పింక్' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఫిల్మ్‌గా వస్తున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి నిన్న చిత్రబృందం ఒక అప్‌డేట్ ఇచ్చింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రంలోని 'సత్యమేవ జయతే' అనే లిరికల్ పాట వీడియో విడుదల చేయనున్నట్లు చెప్పింది. అన్నట్లుగానే సరిగ్గా సమయానికి చిత్రబృందం ఈ పాటను విడుదల చేసింది.
శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతిహాసన్ కథానాయిక కాగా.. కీలకపాత్రల్లో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. 'వకీల్ సాబ్' చిత్రం ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.ఇంకెందుకు ఆలస్యం మీరు ఓసారి ఈ పాటను వినేయండి
Next Story