'పెన్నీ' సాంగ్ లీక్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర‌బృందం

Sarkaru Vaari Paata Penny song leak Movie Makers clarifies.సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 March 2022 9:21 AM GMT
పెన్నీ సాంగ్ లీక్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర‌బృందం

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం 'స‌ర్కారు వారి పాట‌'. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టిస్తోంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతోంది. థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తుండ‌గా.. ఇటీవ‌ల‌ ఈ చిత్రం నుంచి విడుద‌లైన 'క‌ళావ‌తి' పాట య్యూటూబ్‌లో రికార్డుల‌న్ని తిర‌గరాస్తోంది. ఈ క్ర‌మంలో ఈ చిత్రం నుంచి రెండో పాట‌ను విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం సిద్ద‌మైంది.

ఈరోజు(ఆదివారం) సాయంత్రం పూర్తి పాట‌ను విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం శ‌నివార‌మే తెలియ‌జేసింది. అయితే అనుకోని విధంగా.. 'పెన్నీ' పూర్తి పాట ఓ ఆన్‌లైన్ మ్యూజిక్ యాప్‌లో వ‌చ్చేసింది. సాయంత్రం విడుద‌ల కావాల్సిన పాట ఉద‌యమే రావ‌డం షాకింగ్ గా మారింది. గ‌మ‌నించిన అభిమానులు చిత్ర బృందానికి విష‌యాన్ని తెలియ‌జేశారు. ఆ యాప్ వారితో మాట్లాడి పాట‌ను తొల‌గించిన చిత్ర‌బృందం దీనిపై ఓ క్లారిటీ ఇచ్చింది.

సాధార‌ణంగా పాట‌ల‌ను అధికారికంగా విడుద‌ల చేయ‌డానికి ముందే ఆ ఆడియో ట్రాక్స్‌ని ప‌లు ఆడియో స్ట్రీమింగ్ యాప్‌కు పంప‌డం జ‌రుగుతుంద‌ని.. చిత్ర‌బృందం తెలిపిన స‌మ‌యానికి ఆయా యాప్‌లు త‌మ యాప్స్‌లో పాట‌ల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పింది. అలా ఓ యాప్‌లో తాము అనుకున్న స‌మ‌యం కంటే ముందుగానే పాట వ‌చ్చేసింది అని తెలిపింది. వారితో మాట్లాడి పాట‌ను తొల‌గించాం. సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకే పాట‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్లడించింది. ఇక పాట ఎప్పుడు విడుల‌వుతుందా అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సాంగ్‌లో మ‌హేష్ కూతురు సితార బిగ్‌హైలెట్‌గా క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తోంది.

Next Story
Share it