రోడ్డు ప్ర‌మాదంలో న‌టుడు మృతి

Saran Raj, Director Vetrimaaran's Assistant, Dies In Car Accident. దర్శకుడు వెట్రిమారన్ వ‌ద్ద‌ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న సహాయ నటుడు శరణ్ రాజ్ గురువారం కేకే నగర్‌లో జరిగిన కారు ప్రమాదంలో

By Medi Samrat  Published on  9 Jun 2023 5:44 PM IST
రోడ్డు ప్ర‌మాదంలో న‌టుడు మృతి

దర్శకుడు వెట్రిమారన్ వ‌ద్ద‌ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న సహాయ నటుడు శరణ్ రాజ్ గురువారం కేకే నగర్‌లో జరిగిన కారు ప్రమాదంలో మరణించాడు. ఆర్కాట్ రోడ్డులో శరణ్ రాజన్ ప్రయాణిస్తున్న బైక్‌ను మద్యం మత్తులో ఉన్న మరో నటుడి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు న‌డుపుతున్న వ‌క్తి న‌టుడు పళనియప్పన్ (41)గా గుర్తించారు. పళనియప్పన్.. సాలిగ్రామం నుండి ఇంటికి తిరిగి వస్తున్నారు. స్నేహితులతో కలిసి ఓ పార్టీకి వెళ్లిన అతను ప్ర‌మాదం స‌మ‌యంలో మ‌ద్యం మత్తులో ఉన్నాడు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో పళనియప్పన్ ఆర్కాట్ రోడ్డులో డ్రైవింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా అదుపు తప్పి శరణ్‌రాజ్ ద్విచక్రవాహనంపైకి దూసుకెళ్లాడు. మృతుడు శర‌ణ్ రాజ్ (29) మధురవాయల్‌లోని ధనలక్ష్మి నగర్‌ ఆరో వీధి నివాసి. శరణ్‌రాజ్ హెల్మెట్ ధరించలేదని, తలకు బలమైన గాయం తగలడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పళనియప్పన్‌ను అదుపులోకి తీసుకున్నారు. శరణ్‌రాజ్ మృతదేహాన్ని కూడా పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. తదుపరి విచారణ కొనసాగుతుంది. శరణ్ రాజ్ వడ చెన్నైలో వెట్రిమారన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ వడ చెన్నై, అసురన్‌లో సహాయ పాత్రలు కూడా పోషించాడు.


Next Story