నో ఓటీటీ, డైరెక్ట్‌గా టీవీలోకే..'సంక్రాంతికి వస్తున్నాం'..ఎప్పుడంటే?

మార్చి 1న సాయంత్రం ఆరు గంటలకు టెలివిజన్ ప్రీమియర్‌గా ఈ సినిమా ప్రసారం కానుందని తెలిపింది.

By Knakam Karthik
Published on : 22 Feb 2025 10:04 AM

Cinema News, Tollywood, Sankranthiki Vasthunam Movie, Zee Telugu, Actor Venkatesh, AnilRavipudi

నో ఓటీటీ, డైరెక్ట్‌గా టీవీలోకే..'సంక్రాంతికి వస్తున్నాం'..ఎప్పుడంటే?

విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ' సంక్రాంతికి వస్తున్నాం' మూవీ సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని మూవీ లవర్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా ఏదైనా సినిమా థియేటర్లలో విడుదలయ్యాక కొన్ని వారాలకు ఓటీటీలోకి అడుగు పెడుతుంది. ఈక్రమంలోనే 'సంక్రాంతికి వస్తున్నాం' కూడా అదే ట్రెండ్‌ను ఫాలో అవుతుందని సినీ ప్రియులు భావించారు. జీ తెలుగు నుంచి ఈ సినిమా గురించి ప్రకటన వచ్చినప్పటికీ దానికి ఇంకా సమయం ఉంటుందని.. ముందు ఓటీటీలోనే వస్తుందని అందరూ అనుకున్నారు.

అయితే సినీప్రియుల అంచనాలను తారుమారు చేస్తూ జీ తెలుగు నేడు ఆసక్తికర ప్రకటన చేసింది. మార్చి 1న సాయంత్రం ఆరు గంటలకు టెలివిజన్ ప్రీమియర్‌గా ఈ సినిమా ప్రసారం కానుందని తెలిపింది. తాజాగా టెలివిజన్ ప్రీమియర్ కు సంబంధించిన ప్రకటన వెలువడటంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. 'సంక్రాంతికి వస్తున్నాం' కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిందనే చర్చ నెట్టింట జరుగుతోంది. మరోవైపు, దీనికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా బయటకు రాలేదు.

Next Story