ఓటీటీలోకి మ‌సూద‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Sangeetha starrer Masooda OTT Release Date Fix.ఇటీవ‌ల విడుద‌లైన ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన చిత్రాల్లో మ‌సూద ఒక‌టి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Dec 2022 11:09 AM IST
ఓటీటీలోకి మ‌సూద‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఇటీవ‌ల విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన చిత్రాల్లో 'మ‌సూద' ఒక‌టి. 'మళ్లీ రావా', 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' వంటి సినిమాలను అందించిన స్వధర్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెర‌కెక్కిన ఈ చిత్రంలో సంగీత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది. హార‌ర్ క‌థాంశంతో ఈ చిత్రం తెర‌కెక్కింది. సాయికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో తిరువీర్‌, కావ్య కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రం న‌వంబ‌ర్ 18న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.


ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా శుభ‌వార్త చెప్పింది. డిసెంబ‌ర్ 21 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. కోటీన్న‌ర బ్రేక్ ఈవెన్‌తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం 9 కోట్ల‌కు పైగా గ్రాస్‌ను వ‌సూలు చేసి డ‌బుల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

Next Story