‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్..బంగారాలు అంటూ సమంత పోస్ట్

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన తర్వాతి చిత్రం ‘మా ఇంటి బంగారం’తో వెండితెరపై మరో పవర్‌ఫుల్ పాత్రలో మెరిసేందుకు సిద్ధమైంది

By -  Knakam Karthik
Published on : 22 Feb 2026 4:21 PM IST

Cinema News, Tollywood, Samantha, Maa Inti Bangaaram, NandiniReddy, Tralala Moving Pictures

‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్..బంగారాలు అంటూ సమంత పోస్ట్

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన తర్వాతి చిత్రం ‘మా ఇంటి బంగారం’తో వెండితెరపై మరో పవర్‌ఫుల్ పాత్రలో మెరిసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ టాలీవుడ్ ప్రాజెక్ట్ ఈ ఏడాది మే 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ.. "ఈ వేసవిలో థియేటర్లలో కలుద్దాం బంగారాలు" అంటూ పోస్ట్ చేశారు. విడుదల తేదీని ప్రకటించిన పోస్టర్‌లో సమంత తలుపు చాటు నుండి కుతూహలంగా చూస్తున్న లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

బి.వి. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ జనవరిలోనే విడుదలై సంచలనం సృష్టించింది. అందులో సమంత సాధారణ బ్రౌన్ కలర్ చీర కట్టుకుని, బస్సులో నిలబడి ఎంతో తీక్షణమైన చూపులతో యుద్ధానికి సిద్ధమైనట్లుగా కనిపించారు. ఈ చిత్రం గురించి సమంత మాట్లాడుతూ.. ఇది ఎంతో సహజంగా, భావోద్వేగాలతో కూడిన కుటుంబ కథ అని తెలిపారు. ఒక మహిళ తనలోని సున్నితత్వంతో పాటు ధైర్యాన్ని ఎలా ప్రదర్శిస్తుందనేదే ఈ కథాంశమని, ఈ పాత్రలో నటించడంతో పాటు సొంతంగా నిర్మించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఆమె పేర్కొన్నారు.

సినిమా కథనం ఎంతో కొత్తగా, విభిన్నమైన ఎనర్జీతో సాగుతూనే ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసేలా ఉంటుందని సమంత ఆశాభావం వ్యక్తం చేశారు. 'మా ఇంటి బంగారం' చిత్రాన్ని సమంత తన సొంత బ్యానర్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్'పై రాజ్ నిడిమోరు మరియు హిమాంక్ దువ్వూరులతో కలిసి నిర్మిస్తున్నారు. మే 15, 2026న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Next Story