బాలీవుడ్ స్టార్ హీరోను పోలీసులకు పట్టించిన సమంత.. ఎందుకంటే..?
Samantha’s Funny Kurkure Ad With Akshay Kumar Goes viral.టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. సినిమాల
By తోట వంశీ కుమార్ Published on 12 Jan 2022 12:04 PM ISTటాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో పాటు స్పెషల్ సాంగ్‌లతో పుల్ బిజీగా ఉంది. అయితే.. సమంత ఇంట్లోకి దొంగతనం చేయడానికి ఓ దొంగ వచ్చాడు. అయితే అతడు సాదాసీదా దొంగ కాదు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. అవును మీరు చదివింది నిజమే. అక్షయ్ కుమార్ నటి సమంత ఇంట్లో దొంగతనానికి వచ్చాడు. చివరికి అతడిని సమంత పోలీసులకు పట్టించింది. అయితే ఇదంతా ఓ యాడ్ లో భాగంగానే.
తాజాగా సమంత కుర్ కురే యాడ్ లో నటించింది. ఈ యాడ్ లో సమంత తో పాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించాడు. సమంత ఇంట్లో దొంగతనానికి అక్షయ్ కుమార్ వచ్చాడు. అయితే.. అతడిని సమంత గమనిస్తుంది. ఈ లోగా అక్షయ్ కు అక్కడ ఓ కుర్‌కురే ప్యాకెట్ కనిపిస్తుంది. అది చూడగానే అతడి నోట్లో నీళ్లూరతాయి. అతడు ఆ ప్యాకెట్‌ను చేతుల్లోకి తీసుకోగానే మొత్తం సమంత ఫ్యామిలీ అక్కడకు వస్తుంది. అతడి చేతిలోని ప్యాకెట్‌ను లాక్కోంటారు. ఫ్యామిలీ అంతా తింటుంటారు. అక్షయ్ బ్రతిమిలాడడంతో అతడికి కొన్ని తినడానికి ఇస్తారు.
అతడు ప్యాకెట్‌ను ఖాళీ చేసి వెళతాను అని చెబుతాడు. ఆగు నీకోసం బండి వస్తుంది..? అని వారు చెప్పడంతో అక్షయ్ అక్కడే రిలాక్స్ అవుతాడు. అనంతరం అక్కడకు వచ్చిన పోలీసులకు అక్షయ్‌ను సమంత పట్టిస్తుంది. ఈ యాడ్ ను సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'సినిమాల్లో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించే హీరో ఇలా కుర్‌కురే దొంగగా మారిపోయాడు. ఈ ప్రవర్తనేంటి అక్షయ్ కుమార్..? 'అంటూ తన సోషల్ మీడియాలో సమంత రాసుకొచ్చింది. ప్రస్తుతం సమంత పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.