'శాంకుతలం' కోసం సమంత 30 కేజీల చీర కట్టిందా?
Samantha wore a 30 kg saree for 'Shakuntalam'. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఎవరో చెప్పగానే గుర్తుకు వచ్చేది సమంత పేరు.
By అంజి Published on 2 Feb 2023 5:12 PM ISTసౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఎవరో చెప్పగానే గుర్తుకు వచ్చేది సమంత పేరు. తన అందంతో, నటనతో అందరి మనసులను దోచుకుంది ఈ బ్యూటీ. మయోసైటిస్‌తో బాధపడుతున్న ఈ నటి సినిమాల విషయంలో చాలా స్లో అవుతోంది.
తన రాబోయే చిత్రం 'శాకుంతలం' కోసం సమంతా ఒక ప్రత్యేకమైన పని చేసింది. ఆమె తన పాత్ర కోసం 30 కిలోల బరువున్న చీరను ధరించి.. వారం రోజుల కంటే ఎక్కువ రోజుల పాటు షూటింగ్ పాల్గొంది. చాలా మంది హీరోయిన్లు ఒక పాత్ర కోసం ఇంత బరువైన చీర కట్టుకోరు. అది మాత్రమే కాకుండా తన పోషిస్తున్న పాత్ర కోసం దాదాపు మూడు కోట్ల రూపాయల నగలను నిర్మాతలు ప్రత్యేక చేయించారట. సమంత ఈ సినిమా కోసం చాలా కష్టపడిందని దర్శకుడు గుణశేఖర్ అన్నారు.
సమంత నెక్ట్స్ మూవీ ఏమిటి?
విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ సమంత మంచి నటి అని నిరూపించుకుంది. త్వరలో విజయ్ దేవరకొండతో తన తదుపరి చిత్రం షూటింగ్‌ను ప్రారంభించనుంది. దాదాపు ఎనిమిది నెలల క్రితం కాశ్మీర్‌లో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసిన తరువాత, షూటింగ్ ఇంకా తిరిగి ప్రారంభించబడలేదు.
సమంత ప్రస్తుతం 'శాకుంతలం' విడుదల కోసం ఎదురుచూస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి తన తదుపరి ప్రాజెక్ట్ షూటింగ్ ని ముంబైలో స్టార్ట్ చేసింది. సమంత వరుణ్ ధావన్‌తో కలిసి 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. దీనికి రాజ్, డికె దర్శకత్వం వహిస్తున్నారు. 'సిటాడెల్' అనేది రస్సో బ్రదర్స్ రూపొందించిన సిరీస్ (అదే పేరుతో) భారతీయ వెర్షన్.
'కుషి' సినిమాని ప్రారంభించబోతున్న సమంత 'సిటాడెల్'లో పనిచేయాలని నిర్ణయించుకోవడం అభిమానులను షాక్‌కి గురి చేసింది. విజయ్ దేవరకొండ అభిమానులు 'కుషి' పరిస్థితి ఏమిటని అడిగిన ప్రశ్నకు సమంత బదులిస్తూ త్వరలో షూటింగ్ తిరిగి ప్రారంభిస్తాం. ఏది ఏమైనా సమంత బిజీగా ఉన్నప్పటికీ దర్శక, నిర్మాతలు ఆమెను బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన 'యశోద' బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.