సమంత అనారోగ్యంపై చిరు ట్వీట్‌.. ఏమన్నారంటే?

Samantha suffering from Myositis.. Chiranjeevi gave courage to Sam. హీరోయిన్‌ సమంత 'మయోసైటిస్' వ్యాధితో బాధపడుతోంది. కొన్ని నెలల క్రితమే తనకు వ్యాధి సోకిందని

By అంజి  Published on  30 Oct 2022 2:01 PM IST
సమంత అనారోగ్యంపై చిరు ట్వీట్‌.. ఏమన్నారంటే?

హీరోయిన్‌ సమంత 'మయోసైటిస్' వ్యాధితో బాధపడుతోంది. కొన్ని నెలల క్రితమే తనకు వ్యాధి సోకిందని సమంత సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో సమంత త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, కోస్టార్లు, స్నేహితులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి.. సమంతను ఉద్దేశిస్తూ ట్వీట్‌ పెట్టారు. సమంత త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. '' డియర్‌ సామ్‌.. కాలంతో పాటు మన జీవితాల్లో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటి వల్ల మన శక్తి సామర్థ్యాలు ఏంటో మనకు తెలుస్తుంది. మనోబలం కలిగిన అద్భుతమైన అమ్మాయివి నువ్వు. త్వరలోనే ఈ సమస్యను నువ్వు అధిగమిస్తావనే నమ్మకం నాకు ఉంది.'' అంటూ సమంతకు ధైర్యం చెబుతూ చిరంజీవి ట్వీట్‌ చేశారు.

తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత తెలిపింది. అంతేకాకుండా చికిత్స తీసుకుంటున్న ఓ ఫోటోను షేర్‌ చేసింది. తాను బాధపడుతున్న వ్యాధి గురించి అసలు విషయం బయటపెట్టింది. మ్యోసిటిస్ అంటూ తనకు వచ్చిన వ్యాధి గురించి చెబుతూ తన పరిస్థితిని వివరించింది సమంత. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది సామ్. దీంతో ఆమె బాగుండాలని.. వీలైనంత త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తూ ఉన్నారు. సమంత అనారోగ్యంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. సామ్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆమెకు అన్ని విధాలా అండగా ఉంటానని చెప్పారు. నేచురల్ స్టార్ నాని కూడా స్పందించారు. "సమంత మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. బలంగా తిరిగి రండి." యంగ్ టైగర్‌తో 'బృందావనం', 'జనతా గ్యారేజ్' చిత్రాల్లో సమంత నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. నేచురల్ స్టార్ నానితో కలిసి 'ఏటో వెళ్లిపోయింది మనసు', 'ఈగ' చిత్రాల్లో కూడా నటించింది.

Next Story