గూస్‌బంప్స్ తెప్పించారు.. ఆ హీరోయిన్ సినిమాను పొగిడిన సమంత..!

ప్ర‌స్తుతం మలయాళ చిత్రం 'లోకా చాప్టర్ 1' థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాపై పలువురు సినీ తారలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

By Medi Samrat
Published on : 6 Sept 2025 9:19 PM IST

గూస్‌బంప్స్ తెప్పించారు.. ఆ హీరోయిన్ సినిమాను పొగిడిన సమంత..!

ప్ర‌స్తుతం మలయాళ చిత్రం 'లోకా చాప్టర్ 1' థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాపై పలువురు సినీ తారలు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం ద్వారా కళ్యాణి ప్రియదర్శన్ తొలి మహిళా సూపర్‌హీరోగా పరిచయమైంది.

డొమినిక్‌ అరుణ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోకా చాప్టర్‌ 1’ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆగస్ట్ 28న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.66 కోట్లు రాబట్టింది. గతంలో ప్రియాంక చోప్రా, అలియా భట్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

సోషల్ మీడియాలో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సమంత ఇలా రాసింది.. 'లోక సినిమా చూశాను, వావ్!! ఇది మంచి అనుభవం. విజువల్స్, సౌండ్, యాక్షన్ ప్రతి ఫ్రేమ్‌ సజీవంగా అనిపించాయి. సినిమా నన్ను ఆకర్షించింది. ఒక విషయం నా మనసులో నిలిచిపోయింది. అది మా మొదటి సూపర్ హీరో కళ్యాణి ప్రియదర్శన్ సినిమా.. అద్భుతంగా చేసింది. చంద్ర నాకు గూస్‌బంప్స్ ఇచ్చాడు. మొత్తం టీమ్‌కి చాలా ధన్యవాదాలు.

సమంత ప్రశంసలపై చిత్ర నిర్మాత దుల్కర్ సల్మాన్ తన కృతజ్ఞతలు తెలుపుతూ.. 'చాలా థాంక్స్ సమంతా! ఇది లోకా బృందానికి సంతోషాన్నిస్తుంది. చాలా ప్రేమ కురిపించారని పేర్కొన్నాడు. ప్రేక్షకులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం దక్షిణ భారతదేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన మహిళా ప్రధాన చిత్రంగా నిలిచింది.

సమంత రూత్ ప్రభు త్వరలో 'రక్త బ్రహ్మాండ' సిరీస్‌లో కనిపించనుంది. 2026లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు అలీ ఫజల్, వామిక గబ్బి కనిపించనున్నారు. ఈ సిరీస్‌కి రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తున్నారు.

Next Story