ఆ డైరెక్టర్‌నే పెళ్లి చేసుకున్న సమంత..!
By - Medi Samrat |
సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి ఈరోజు ఉదయం కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి సన్నిధిలో జరిగింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి కూతురు సమంత ఎరుపు రంగు శారీ ధరించింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ ఇరువురు ఒక్కటయ్యారు. గత ఏడాది సమంత, రాజ్‌తో కలిసి ఉన్న ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లలో పోస్ట్ చేసింది. అప్పటి నుంచే వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. రాజ్ నిడుమోరు దర్శకత్వం వహించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌లో సమంత నటించింది. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం మొదలైంది.
సమంత గతంలో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వివాహ బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. పెళ్లైన నాలుగేళ్లకే ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత నాగ చైతన్య శోభితా ధూళిపాళ్లను పెళ్లి చేసుకున్నాడు. అయితే సమంత మాత్రం కొద్దికాలం సింగిల్‌గానే జీవించింది. మధ్యలో మయోసైటిస్ వ్యాధితో బాధపడింది. దాని నుంచి కోలుకుని ఇప్పుడు ఆమె రాజ్ నిడిమోరును వివాహం చేసుకుని కొత్త అధ్యాయం ప్రారంభించింది.