మేమిద్దరం ఆ విషయంలో చాలా ఇరిటేటింగ్ కపుల్..భర్తపై సమంత క్రేజీ కామెంట్స్

నటి సమంత రూత్ ప్రభు తన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు

By -  Knakam Karthik
Published on : 24 Feb 2026 9:20 PM IST

Cinema News, Tollywood, Samantha, RajNidimoru, MaaIntiBangaram, SamanthaRajWedding

మేమిద్దరం ఆ విషయంలో చాలా ఇరిటేటింగ్ కపుల్..భర్తపై సమంత క్రేజీ కామెంట్స్

నటి సమంత రూత్ ప్రభు తన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు గురించి ఆమె ఎంతో ప్రేమగా మాట్లాడారు. తామిద్దరం ప్రతి పనినీ కలిసి చేసే ఒక 'చిరాకు తెప్పించే జంట' లాంటి వాళ్లమని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. తాము కలిసి పని చేస్తామని, కలిసి ఆడుకుంటామని, చివరికి వర్కవుట్స్ కూడా కలిసే చేస్తామని ఆమె తెలిపారు. తమ మధ్య ఉన్నది కేవలం హనీమూన్ ఫేజ్ మాత్రమే కాదని, అంతకు మించిన బలమైన బంధమని ఆమె చెప్పుకొచ్చారు. రాజ్ పక్కన ఉండటం వల్లే తాను ఒక మంచి నటిగా మారుతున్నానని సమంత అభిప్రాయపడ్డారు.

వీరిద్దరూ మొదటిసారి 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2' సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత 'సిటాడెల్: హనీ బన్నీ' సిరీస్ కోసం కలిసి పనిచేశారు. 2024 నుంచి వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై వార్తలు రాగా, గత ఏడాది డిసెంబర్ 1న వీరు వివాహం చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, సమంత నటిస్తున్న 'మా ఇంటి బంగారం' చిత్రం మే 15న విడుదల కానుంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామాకు రాజే క్రియేటర్‌గా వ్యవహరించడం విశేషం.

Next Story