'మా ఇంటి బంగారం' టీజర్ ట్రైలర్ విడుద‌ల‌

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మా ఇంటి బంగారం' సినిమా టీజర్‌ ట్రైలర్‌ విడుదలైంది. రాజ్‌ నిడిమోరుతో వివాహం తర్వాత...

By -  అంజి
Published on : 9 Jan 2026 1:43 PM IST

Samantha, Maa Inti Bangaaram movie, teaser trailer, Tollywood

'మా ఇంటి బంగారం' టీజర్ ట్రైలర్

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మా ఇంటి బంగారం' సినిమా టీజర్‌ ట్రైలర్‌ విడుదలైంది. రాజ్‌ నిడిమోరుతో వివాహం తర్వాత ఆమె నటిస్తున్న తొలి సినిమా ఇది. నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్‌లో సమంత ఫైట్స్‌, బీజీఎం ఆకట్టుకున్నాయి. అమాయకంగా కనిపిస్తూనే యాక్షన్‌ సీన్స్‌లో సమంత అదరగొట్టేశారు. ఫైట్ సీన్స్‌లో తనదైన శైలిలో నటించారు. ఈ సినిమా 1980ల నాటి క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు గుల్షాన్‌ దేవయ్య కీ రోల్‌లో నటిస్తున్నారు. కన్నడ స్టార్ దిగంత్ కూడా ఈ మూవీలో నటించారు. కాగా పెళ్లి తర్వాత సమంత నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో.. 'మా ఇంటి బంగారం' పై భారీ అంచనాలు ఉన్నాయి. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రాన్ని స్వయంగా సమంత తన సొంత బ్యానర్ ‘త్రలాల మూవీంగ్ పిక్చర్స్’పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరుతో కలిసి నిర్మిస్తోంది.

Next Story