నెటీజన్ తిక్క ప్రశ్న.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన సమంత
Samantha has a hilarious yet fitting reaction after Instagram user asks 'have you reproduced'.టాలీవుడ్ స్టార్
By తోట వంశీ కుమార్ Published on 22 Feb 2022 11:26 AM GMT
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ప్రస్తుతం వరుస చిత్రాలతో పుల్ బిజీగా ఉంది. సామ్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాది అన్న సంగతి తెలిసిందే. తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా.. 'ఆస్క్ మీ ఎనీథింగ్' (ఏదైనా అడగండి.. సమాధానం ఇస్తా) అనే సెషన్‌ను నిర్వహించింది. దీంతో పలువురు అభిమానులు ఆమెను వరుస ప్రశ్నలు అడిగారు. అభిమానులు అడిగిన ప్రశ్నలు అన్నింటికి సమంత తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.
అయితే.. ఓ నెటీజన్ మాత్రం మీరు ఎవరినైనా పుట్టించారా(రీ ప్రొడ్యూస్) చేశారా..? ఎందుకంటే నేను మీతో రీ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నా అంటూ ప్రశ్నించాడు. దీనికి సమంత.. రీ ప్రొడ్యూస్ అంటే ఏంటో ఒక వాక్యంలో చెప్పగలవా..? ముందుగా ఆ పదానికి గూగుల్ చేయాల్సింది అంటూ సమాధానం ఇచ్చింది.
మరో నెటీజన్ యంగ్ జనరేషన్ కోసం ఇచ్చే సలహా ఏంటీ అని అడిగాడు. 'విరామం తీసుకోండి. డోంట్ బర్న్ అవుట్' అని బదులిచ్చింది. బెన్ జోహ్మర్, రాబ్ మూసేల 'హోమ్' తన ఫేవరేట్ సాంగ్ అని, తనకి కామెడీ అంటే కూడా ఇష్టమని చెప్పుకొచ్చింది సామ్. మీరు బాగున్నారా..? అని ప్రశ్నించగా.. 'అలా అడిగినందుకు ధన్యవాదాలు.. నేను బాగానే ఉన్నా' అని చెప్పింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. సమంత ప్రస్తుతం శాకుంతలం, యశోద చిత్రాలతో పాటు ఓ వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తోంది.