హాలీవుడ్ మూవీకి సమంత ఒకే!
సమంత ఓ హాలీవుడ్ ప్రాజెక్టుకు అంగీకారం తెలిపింది. ఈ మూవీకి 'చెన్నై స్టోరీ' అనే టైటిల్ కూడా ఫిక్సయినట్లు సమాచారం.
By అంజి Published on 1 Jun 2023 12:15 PM ISTహాలీవుడ్ మూవీకి సమంత ఒకే!
'ఏ మాయ చేశావే' మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సమంత. ఆ తర్వాత 'బృందావనం', 'దూకుడు', 'ఈగ' వంటి హిట్ సినిమాలతో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. ఒక్కసారిగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారింది. టాలీవుడ్ హీరోలకు అదృష్టదేవతగా మారింది. 10 ఏళ్ల పాటు దక్షిణాది అగ్ర హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత.. ఆ తర్వాత 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా వైడ్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. సమంత లేటెస్ట్‌గా నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్‌తో మరోసారి క్రేజ్ సంపాదించుకోనుంది సామ్. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుండి రిలీజైన పోస్టర్‌కు ప్రేక్షకులను బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ అమ్మడు ఓ హాలీవుడ్ ప్రాజెక్టుకు అంగీకారం తెలిపింది. ఈ మూవీకి 'చెన్నై స్టోరీ' అనే టైటిల్ కూడా ఫిక్సయినట్లు సమాచారం. హాలీవుడ్‌లో పలు టెలివిజన్ షోలకు పని చేసిన ఫిలిప్ జాన్ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నాడు. ఇంగ్లండ్ యాక్టర్ వివేక్ కల్రా హీరో నటించనున్న ఈ సినిమా కథ.. మొత్తం లండన్‌లో స్థిరపడ్డ ఓ ఇండియన్ మూలాలున్న ఇంగ్లీష్ యువకుడి చుట్టు సాగుతుందట. హీరో తన తండ్రికి వెతుక్కుంటూ చెన్నైకి వస్తాడు. అక్కడే అతడికి ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి హీరో తండ్రిని వెతుకుతారు. ఆ తర్వాత ఏం జరిగిందన్న ఇతివృత్తంతో మూవీని తీయనున్నట్లు తెలుస్తోంది.
రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతన్న ఈ మూవీని విల్ మచిన్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా షూటింగ్ బ్రిటన్ తో పాటు చెన్నైలోనూ జరుగనుంది. మొదట ఈ సినిమాను హాలీవుడ్‌లో విడుదల చేసి ఆ తర్వాత ఇండియాలో అన్ని భాషల్లో విడుదల చేయనున్నారట సినీ వర్గాల టాక్. ఇక సమంతకు ఇదే తొలి హాలీవుడ్ సినిమా. ప్రస్తుతం సమంత ఖుషీ సినిమాలో నటిస్తోంది.