ఇంట్లో చోరీకి వ‌చ్చిన దొంగ‌కు అన్నం పెట్టిన సల్మాన్

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు వ్య‌క్తులు ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరప‌డంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

By అంజి  Published on  6 Aug 2024 6:30 PM IST
Salman Khan, Hungry, Thief, Lawrence Bishnoi Gang, Bollywood

ఇంట్లో చోరీకి వ‌చ్చిన దొంగ‌కు అన్నం పెట్టిన సల్మాన్

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు వ్య‌క్తులు ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరప‌డంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇది గతం. తాజాగా సల్మాన్ ఖాన్ మంచి మనసున్న వ్యక్తిగా నిరూపించుకున్నాడు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కారణంగా అతడు తరచుగా వార్త‌ల్లో నిలుస్తాడు. అత‌డి దయగల మనసుతో సల్మాన్ ఒకప్పుడు దొంగకు ఆహారం తినిపించాడని తెలుసా.?

అవును న్యూస్ 18 నివేదిక ప్రకారం.. సల్మాన్ ఒకసారి తన ఇంట్లోకి ప్రవేశించిన దొంగను పట్టుకున్నాడు. పోలీసులను పిలవడానికి ముందు.. సల్మాన్ ఆకలితో ఉన్న దొంగకు ఆహారం కూడా తినిపించాడు. ప్రీతి జింటా షో.. అప్ క్లోజ్ అండ్ పర్సనల్ విత్ PZకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ ఈ విషయాన్ని వెల్లడించాడు.

గ్రాండ్ పార్టీ తర్వాత స‌ల్మాన్‌ అతని సోదరుడు అర్బాజ్ పడుకోవడానికి వారి బెడ్‌రూమ్‌కి వెళ్లగా.. ఇంతలో అక్కడక్కడా కదులుతున్న పెద్ద నీడ కనిపించింది. దీంతో సల్మాన్ తన సోదరుడిని నిశ్శబ్దంగా ఉండమని అడిగాడు. త‌ర్వాత‌ అన్నదమ్ములిద్దరం కలిసి దొంగను పట్టుకుని కట్టేసిన‌ట్లు తెలిపాడు.

దొంగ వద్ద వాక్‌మ్యాన్, రూ.5 మాత్రమే ఉన్నాయని.. ఇదే తన మొదటి దొంగతనం అని చెప్పాడు. అయితే.. దొంగ తినలేదని తెలుసుకున్న సల్మాన్ అతనికి ఆహారం ఇవ్వ‌గా.. అతని తల్లి వచ్చి దొంగకు ఆహారం ఎందుకు పెడుతున్నావని అడిగింద‌ట‌. అందుకు స‌ల్మాన్‌.. నేను మంచి మ‌నిషిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా.. తిన్న‌ తర్వాత పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పిన‌ట్లు తెలిపాడు. తెల్లవారుజామున 6 గంటల‌కు దొంగను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధ‌మ‌వ‌గా.. దొంగను అక్కడికి తీసుకెళ్లి అన్ని పేపర్లలో చిక్కుకోవడం కన్నా బయట కట్టేసి వారికి స‌మాచారం ఇవ్వ‌డం మంచిదని సూచించాడు. ఆ త‌ర్వాత దొంగ‌ను ఒక ముడితో క‌ట్టేయ‌గా.. పోలీసులు వచ్చేలోపు అతడు తప్పించుకున్నాడ‌ని సల్మాన్ వెల్లడించాడు.

Next Story