గాడ్ ఫాదర్ షూటింగ్‌లో సల్మాన్ ఖాన్.. స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందన్న చిరంజీవి
Salman Khan joins the sets of Chiranjeevi's Godfather Movie.మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలతో పుల్ బిజీగా
By తోట వంశీ కుమార్ Published on
16 March 2022 5:41 AM GMT

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలతో పుల్ బిజీగా ఉన్నారు. అందులో మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గాడ్‌ఫాదర్' చిత్రం ఒకటి. మలయాళ చిత్రం లూసీఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో చిరు సరసన నయనతార నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ నటించనున్నాడు అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబైలో జరుగుతుండగా.. తాజాగా సల్మాన్ ఖాన్ కూడా జాయిన్ అయ్యాడట.
ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. సల్మాన్ కి చిరంజీవి పుష్పగుచ్చం అందచేసి గ్రాండ్ వెల్కమ్ తెలియచేసారు. సల్లూ భాయ్‌కు వెల్‌కమ్ చెబుతూనే ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. 'మీ రాక ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచింది. ఉత్సాహాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. మీతో స్క్రీన్‌ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ ప్రజెన్స్ ప్రేక్షకులకు అద్భుతమైన కిక్‌ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు' అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Next Story