తెలుగు దర్శకుడితో ప‌నిచేయ‌నున్న సల్మాన్ ఖాన్..!

సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం మాతృభూమి షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

By -  Medi Samrat
Published on : 30 March 2026 1:59 PM IST

తెలుగు దర్శకుడితో ప‌నిచేయ‌నున్న సల్మాన్ ఖాన్..!

సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం మాతృభూమి షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే.. కొంతకాలంగా సల్మాన్, దిల్‌రాజు కలిసి పనిచేయనున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈరోజు సల్మాన్ స్వయంగా ఒక పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది.

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఒక తెలుగు దర్శకుడు, నిర్మాతతో చేతులు కలుపుతున్నారు. ఈ విషయాన్ని సల్మాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ప్రకటించారు. దిల్‌రాజు నిర్మించనున్న ఈ రాబోయే చిత్రంలో సల్మాన్, దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి పనిచేయనున్నారు.

సల్మాన్ ఖాన్ దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి ఉన్న ఒక ప్రత్యేక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆ ఫోటోతో పాటు.. "ఈ ఏప్రిల్‌లో వంశీ, దిల్‌రాజులతో చేసే సినిమా ప్రారంభం కారుంద‌ని అని సల్మాన్ రాశారు.

వంశీ పైడిపల్లి తెలుగులో ప‌లు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. అతని ఫిల్మోగ్రఫీలో ప్రభాస్ (మున్నా), ఎన్టీఆర్ (బృందావనం), రామ్ చరణ్, అల్లు అర్జున్ (ఎవడు), నాగార్జున, కార్తీ (ఊపిరి), మహేష్ బాబు (మహర్షి), విజయ్ (వరిసు) వంటి చిత్రాలు ఉన్నాయి.

Next Story