పాముకాటుకు గురైన స‌ల్మాన్‌ఖాన్‌.. ప్రాణ‌హాని లేద‌న్న వైద్యులు

Salman Khan gets bitten by snake at Panvel farmhouse.బాలీవుడ్ స్టార్ హీరో, కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్ పాముకాటుకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Dec 2021 7:42 AM GMT
పాముకాటుకు గురైన స‌ల్మాన్‌ఖాన్‌.. ప్రాణ‌హాని లేద‌న్న వైద్యులు

బాలీవుడ్ స్టార్ హీరో, కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్ పాముకాటుకు గుర‌య్యారు. గ‌త కొద్ది రోజులుగా మ‌హారాష్ట్ర‌లోని ప‌న్వేల్ ఫామ్‌హౌస్‌లో స‌ల్మాన్ ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆదివారం తెల్ల‌వారుజామున స‌ల్మాన్‌ఖాన్‌ను పాము క‌రిచింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన వ్య‌క్తిగ‌త సిబ్బంది ఆయ‌న్ని ముంబైలోని ఎంజీఎం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స అందించిన అనంత‌రం డిశ్చార్జి చేశారు. కాగా.. విషం లేని పాము స‌ల్మాన్‌ను కాటేసింద‌ని వైద్యులు చెప్పారు. దీంతో ఆయ‌న‌కు ఎటువంటి ప్ర‌మాదం లేద‌న్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఎవ‌రూ ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

ఇదిలా ఉంటే.. హిందీ బిగ్‌బాస్ సీజ‌న్‌ 15 కి స‌ల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్య‌వ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో, కంటెస్టెంట్లతో కలిసి హోస్ట్ సల్మాన్ క్రిస్మస్‌తో పాటు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు దర్శకుడు రాజమౌళితో కలిసి ఆలియా భట్ ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకున్నారు. రేపు(డిసెంబ‌ర్ 27) తేదీన స‌ల్మాన్ 56 ఏట అడుగుపెట్ట‌నున్నాడు.

Next Story
Share it