'సలార్‌' క్రేజ్.. దద్దరిల్లుతున్న థియేటర్లు

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన 'సలార్‌' సినిమా ఇవాళ భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ అయ్యింది. దీంతో ఫ్యాన్స్‌ హంగామా చేస్తున్నారు.

By అంజి  Published on  22 Dec 2023 6:33 AM IST
Salar movie , Salar theatres, Tollywood, Prabhas

'సలార్‌' క్రేజ్.. దద్దరిల్లుతున్న థియేటర్లు

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన 'సలార్‌' సినిమా ఇవాళ భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ అయ్యింది. దీంతో ఫ్యాన్స్‌ హంగామా చేస్తున్నారు. ఇప్పటికే ప్రీమియర్‌ షోలు పడటంతో ప్రేక్షకుల అరుపులు, కేకలతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. సినిమా సూపర్‌ హిట్‌ అంటూ కొందరు టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. సంధ్య థియేటర్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. ప్రీమియర్స్‌ చూసిన ప్రేక్షకులు పాజిటివ్‌ టాక్‌తో సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ప్రభాస్‌ ఎంట్రీ, ఎలివేషన్స్‌ సూపర్‌గా ఉన్నాయని, ఇంటర్వెల్‌ ఫైట్‌ సీన్‌ ఓ రేంజ్‌లో ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. సెకండాఫ్‌ ఎమోషనల్‌, యాక్షన్‌ సీన్స్‌ ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లోని మల్లికార్జున థియేటర్‌లో 'సలార్‌' ప్రీమియర్‌ షోను నిర్వాహకులు నిలిపివేశారు. ఎక్కువ మంది థియేటర్‌లోకి రావడంతో షో వేయలేదు. దీంతో అభిమానులు ఆగ్రహావేశాలకు గురయ్యారు. రద్దీని నియంత్రించేందుకు వచ్చిన పోలీసులతో ప్రేక్షకులు గొడవకు దిగారు.

ఈ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు, సప్తగిరి, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రీయారెడ్డి, జాన్ విజయ్, ఝాన్సీ, పృథ్వీరాజ్, టిను ఆనంద్ తదితరులు నటించారు. రచన, దర్శకత్వం ప్రశాంత్‌ నీల్‌ వహించగా.. విజయ్‌ కిరంగదూర్‌ సినిమాను నిర్మించారు. సినిమాటోగ్రఫి భువన్ గౌడ, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి, మ్యూజిక్ రవి బస్రూర్ అందించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై సినిమాను నిర్మించారు.

Next Story