'సలార్' ట్రైలర్.. యాక్షన్ అదిరింది..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు.

By Medi Samrat  Published on  1 Dec 2023 8:31 PM IST
సలార్ ట్రైలర్.. యాక్షన్ అదిరింది..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు. వారి అంచనాలను మించేలా 'సలార్‌ పార్ట్‌1: సీజ్‌ఫైర్‌' ట్రైలర్ ఉంది. ఈ ట్రైలర్ 3 నిమిషాల 47 సెకన్ల పాటూ సూపర్ గా ఉంది. ప్రభాస్‌ మూవీ నుంచి ఫ్యాన్స్ కోరుకునే అన్ని మాస్‌ అంశాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.


ప్రభాస్, పృథ్వీరాజ్ మధ్య ఉన్న స్నేహాన్ని ట్రైలర్ లో చూపించారు. ట్రైలర్ చివర్లో ప్రభాస్‌ యాక్షన్ హైలైట్ గా నిలిచింది. ఖన్సార్ అనే ప్రాంతాన్ని రాజమన్నార్(జగపతిబాబు) అనే వ్యక్తి ఏలుతుంటాడు. ఇతడి కొడుకు వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్). ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ స్నేహితులు. చిన్నతనం నుంచే దేవ (ప్రభాస్), వరదరాజ్ మన్నార్ (పృథ్విరాజ్ సుకుమారన్) మధ్య స్నేహం ఉంటుంది. చిన్నతనంలోనే వారు విడిపోతారు. “నీ కోసం ఎరైనా అవుతా.. సొరైనా అవుతా..నీ ఒక్కడి కోసం.. నువ్వు ఎప్పుడు పిలిచినా ఇక్కడికి వస్తా” అని చెప్పి దేవ వెళ్లిపోతాడు. రాజమన్నార్‌ తన కుమారుడు వరదరాజ్‍ను దొరగా తన ప్లేస్‍లోకి రావాలని కోరుకుంటాడు. వరదరాజ్‍ను చంపేందుకు వచ్చే వారిని దేవ ఎలా ఎదుర్కొన్నాడు.. ఆ తర్వాత ఏమి జరిగాయన్నది సినిమాలో చూడాల్సిందే!!

Next Story