సలార్ రీ రిలీజ్.. బ్లాక్ బస్టర్ స్టార్ట్

ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్' మార్చి 21న గ్రాండ్ రీ-రిలీజ్ కు సిద్ధమైంది.

By Knakam Karthik  Published on  14 March 2025 7:03 PM IST
Cinema News, Tollywood, Entertainment, Salaar Re-release

సలార్ రీ రిలీజ్.. బ్లాక్ బస్టర్ స్టార్ట్

ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్' మార్చి 21న గ్రాండ్ రీ-రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రభాస్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు ₹600 కోట్లు వసూలు చేసింది. చాలా మంది ఈ సినిమా ₹1000 కోట్ల మార్కు చేరుకుంటుందని అనుకున్నారు. షారుఖ్ ఖాన్ 'డంకీ' సినిమాతో పోటీ కారణంగా దీని హిందీ కలెక్షన్లు కూడా ప్రభావితమయ్యాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఈ సినిమా థియేటర్ ప్రదర్శన తన అంచనాలను పూర్తిగా అందుకోలేదని అంగీకరించారు.

ఈ సినిమా OTT విడుదల తర్వాత ఎంతో మందికి ఎక్కేసింది. చాలా మంది ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా ఫైట్స్ ను రిపీట్ మోడ్ లో చూసారు. దీని ఫలితంగా సలార్ 2 పై అంచనాలు విపరీతంగా పెరిగాయి. సీక్వెల్ ను మొదట వెంటనే ప్రారంభించాలని అనుకున్నారు, కానీ నీల్ మునుపటి కమిట్‌మెంట్లు, జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా కారణంగా, ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయింది.

అయితే సలార్ రీ రిలీజ్ చేయాలంటూ అభిమానులు డిమాండ్ చేయడంతో మేకర్స్ ముందుకు వచ్చారు. ముందస్తు బుకింగ్‌లు రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యాయి. పరిమిత షోలకు సంబంధించి బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఒక రోజులోనే BookMyShowలో 25,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. మరిన్ని స్క్రీనింగ్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఊపు కొనసాగితే, సలార్ అన్ని రీ రిలీజ్ రికార్డులను బద్దలు కొట్టవచ్చు.

Next Story