బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న 'సలార్‌'.. డే - 2 కలెక్షన్లు ఎంతో తెలుసా?

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ - దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'సలార్‌' బాక్సాఫీస్‌ దగ్గర రికార్డులు కొల్లగొడుతోంది.

By అంజి  Published on  24 Dec 2023 11:57 AM IST
Salaar box office collection day 2

బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న 'సలార్‌'.. డే - 2 కలెక్షన్లు ఎంతో తెలుసా?

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ - దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'సలార్‌' బాక్సాఫీస్‌ దగ్గర రికార్డులు కొల్లగొడుతోంది. ముందుగా అంచనా వేసిన ప్రకారమే కలెక్షన్లలో జెట్ స్పీడ్​తో దూసుకుపోతోంది. డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజే దేశ వ్యాప్తంగా రూ.93.45 కోట్లు వసూల్‌ చేసింది. ఇదే జోరును రెండో రోజూ ప్రదర్శిస్తూ అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.57.61 కోట్ల కలెక్షన్లను సాధించింది. దీంతో రెండు రోజుల్లోనే సినిమా దాదాపు రూ.150 కోట్లు దాటింది. వరల్డ్​వైడ్​గా 'సలార్' తొలిరోజు రూ. 178.7 కోట్లు వసూల్ చేసింది.

రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు చేసిన సినిమాగా 'సలార్' నిలిచింది. విడుదలైన తొలి రెండు రోజుల్లో వసూళ్ల సునామీ సృష్టించిన సలార్ మూడో రోజు కూడా అదే హవా కొనసాగించనుందని సినిమా ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మూడో రోజు ఆదివారం కూడా సలార్‌కు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగాయని లెక్కలు చెబుతున్నాయి. ఆదివారం కూడా ఇప్పటివరకు రూ. 20 కోట్ల వరకు బుకింగ్స్ జరిగినట్లు తెలుస్తోంది.

Next Story